విమ్ ప్లాస్ట్ ఎయిర్ కూలర్స్ ఇక కూల్ కూల్!

28 Apr, 2016 02:20 IST|Sakshi
విమ్ ప్లాస్ట్ ఎయిర్ కూలర్స్ ఇక కూల్ కూల్!

హైదరాబాద్: విమ్ ప్లాస్ట్ కంపెనీ తన ఎయిర్ కూలర్స్ విక్రయించుకోడానికి మార్గం సుగమం అయ్యింది. ఇందుకు గుజరాత్ హైకోర్ట్ తగిన ఆదేశాలు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే... సింఫనీ కంపెనీ గాంధీనగర్ జిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ... విల్ ప్లాస్ట్‌కు చెందిన సెల్లో బ్రాండ్ ఎయిర్ కూలర్ మోడళ్లు- మార్వెల్, వేవ్, టోవర్‌లు తమ కంపెనీ రిజిస్ట్రర్ డిజైన్లయిన వింటర్, సుమో, డైట్ మోడళ్లను పోలివున్నాయని పేర్కొంది. వీటి విక్రయాలను నిలుపుచేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. 

దీనితో జిల్లా కోర్టు సింఫనీకి అనుకూలంగా రూలింగ్ ఇస్తూ... విమ్ ప్లాస్ట్ కూలర్ మోడళ్లు టవర్-25, టోవర్-50, వేవ్, మార్వెల్ అమ్మకాన్ని నిలుపుచేసింది. దీనిని సవాలుచేస్తూ...  విమ్ ప్లాస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు మంగళవారం దిగువకోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. దీనితో విమ్ ప్లాస్ట్ తమ మోడళ్లను ఎటువంటి ఇబ్బందులూ లేకుండా విక్రయించుకోడానికి మార్గం సుగమం అయ్యింది.  ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేర్ ధర రూ.36 పెరిగి (2 శాతం) రూ.1,825కు చేరింది.

>
మరిన్ని వార్తలు