స్పామ్ కాల్స్ బెడద ఎవరికి ఎక్కువో తెలుసా..?

19 May, 2016 17:23 IST|Sakshi
స్పామ్ కాల్స్ బెడద ఎవరికి ఎక్కువో తెలుసా..?

అహ్మదాబాద్ : ఈ కాలంలో మొబైల్ వాడే ప్రతి యూజర్ కు అవసరం లేని కాల్స్ వస్తుంటాయి. అది పరిచయం లేని వ్యక్తుల నుంచి కాని, వ్యాపార ప్రకటన దారుల నుంచి కాని, మార్కెటింగ్ సంస్థలు కాని చేస్తుంటాయి. దేశమంతటా వైర్ లెస్ టెలి-సాంద్రత పెరిగినప్పటి నుంచీ ఈ అవసరం లేని కాల్స్(స్పామ్ కాల్స్) బెడద ఎక్కువైంది. గుజరాత్ లో ఈ స్పామ్ కాల్స్ సంఖ్య మరీ అధికమైందట. నెలకు 400లక్షలకు పైగా స్పామ్ కాల్స్ గుజరాత్ వినియోగదారులను బాధిస్తున్నాయని వెల్లడైంది. వారానికి 101లక్షల స్పామ్ కాల్స్ బెడదతో గుజరాతీయులు విసుగుచెందుతున్నారని తెలుస్తోంది.

ఈ కాల్స్ కేవలం యూజర్లకు విసుగు తెప్పించడమే కాకుండా, ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఆ పనికి ఆటంకం కూడా ఎక్కువగా కల్గిస్తుంటాయి. ట్రూకాలర్ డేటా ప్రకారం భారత మొబైల్ వినియోగదారులు నెలకు 3000 లక్షల స్పామ్ కాల్స్ ను పొందుతున్నారని వెల్లడైంది. భారత్ లో టాప్ నగరాలుగా ఉన్న ఢిల్లీకి 52 స్పామ్ కాల్స్ ను పొందుతూ మొదటిస్థానంలో నిలుస్తుండగా.. ముంబాయి 520లక్షల స్పామ్ కాల్స్ బెడదతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లు స్పామర్ల జాబితాలో తర్వాతి స్థానాల్లో టార్గెట్ గా ఉన్నాయని వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ 450 లక్షల స్పామ్ కాల్స్, గుజరాత్ 400లక్షల స్పామ్ కాల్స్ ను పొందుతున్నాయని డేటాలో తెలిసింది. మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాలకు కూడా వీటి బెడద ఎక్కువగానే ఉందంట.
 

స్పామ్ కాల్ అంటే....
స్పామ్ కాల్ అనేది ఇదో రకమైన మెసేజింగ్ వ్యవస్థ. మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం అందించే కమ్యూనికేషన్ సర్వీసు. 2000 సంవత్సరం నుంచి ఇండియాలో మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. దీంతో యూజర్లకు అవసరం లేని కాల్స్, వాణిజ్య ప్రకటన ఫోన్లు  పెరిగాయి.      
 

మరిన్ని వార్తలు