మా బంగారు గనుల్లో పెట్టుబడులు పెట్టండి

10 Jun, 2019 10:21 IST|Sakshi
ఫటోమటా బాల్డేకు జ్ఞాపిక అందజేస్తున్న బొమ్మనహళ్లి బాబు

అత్తిక గోల్డ్‌ అధినేతకు గునియా రాయబారి ఆహ్వానం  

సాక్షి బెంగళూరు:  పశ్చిమ ఆఫ్రికా గునియా దేశంలో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ వ్యాపారవేత్త, అత్తిక గోల్డ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అధినేత బొమ్మనహళ్లి బాబును ఆ దేశ ప్రభుత్వం  ఆహ్వానించింది.  భారత్‌లోని ఆ దేశ రాయబారి ఫటోమటా బాల్డే  ఇటీవల బెంగళూరులోని అత్తిక గోల్డ్‌ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఈ మేరకు ఆహ్వానం పలికారు. బాబు మాట్లాడుతూ.. గునియాలోని బంగారు గనుల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలుమార్లు ఆహ్వానం వచ్చిందని, త్వరలో వెళ్లి ఒప్పందం చేసుకుని వస్తానని మీడియాకు తెలిపారు. అత్తిక గోల్డ్‌ కంపెనీకి బెంగళూరులో 28 శాఖలతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 150 బ్రాంచీలు ఉన్నట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో 200 శాఖలకు చేరుకుంటామని చెప్పారు.   

మరిన్ని వార్తలు