జస్ట్‌ రూ.500కే ​క్రెడిట్‌ కార్డు వివరాలు

17 Oct, 2017 13:51 IST|Sakshi

ఇండోర్‌ : సైబర్‌ కేటుగాళ్లు ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను మధ్య ప్రదేశ్‌ పోలీసు సైబర్‌ స్క్వాడ్‌ అరెస్టు చేసింది. హ్యాక్‌ చేసిన క్రెడిట్‌ కార్డు వివరాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వీరు, పెద్ద మొత్తంలో కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను ఎంజాయ్‌ చేస్తున్నారని సీనియర్‌ అధికారులు చెప్పారు. డార్క్‌ వెబ్‌ ద్వారా హ్యాక్‌ చేసిన క్రెడిట్‌ కార్డు వివరాలను వీరు పొందుతున్నారని, ప్రతి క్రెడిట్‌ కార్డును కొనుగోలు చేయడానికి రూ.500 నుంచి రూ.800 వెచ్చిస్తున్నారని రాష్ట్ర సైబర్‌ సెల్స్‌ ఇండోర్‌ యూనిట్‌ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు జితేంద్ర సింగ్‌ తెలిపారు. బిట్‌ కాయిన్‌ ద్వారా పేమెంట్లు జరిపి క్రెడిట్‌ కార్డు వివరాలను రాబడుతున్నారని పేర్కొన్నారు. 

ఈ ఇద్దరు వ్యక్తులను రామ్‌కుమార్‌ పిళ్ళై, రాంప్రసాద్‌ నాదర్‌గా అధికారులు గుర్తించారు. ముంబైకు చెందిన వీరు, పాకిస్తాన్‌కు చెందిన షైక్‌ అఫ్జల్‌ కా షోజి నడిపే అంతర్జాతీయ సైబర్‌ క్రిమినల్స్‌ గ్యాంగ్‌ తరుఫున పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లాహోర్‌కు చెందిన షోజి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సందర్శించినట్టు ఎస్‌పీ చెప్పారు. నాదర్‌, పిళ్ళైతో షోజి స్కైప్‌లో మాట్లాడాడని తెలిపారు. ఈ సైబర్‌ గ్యాంగ్‌కు చెందిన సభ్యులు డార్క్‌ వెబ్‌ ద్వారా క్రెడిట్‌ కార్డు వివరాలు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వివరాలతో బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌, దుబాయ్‌, హాంకాంగ్‌, మలేసియా వంటి ప్రాంతాలకు విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడం చేస్తున్నారని, అదేవిధంగా పెద్ద మొత్తంలో ఖరీదైన వస్తువులు కొంటున్నారని ఎస్‌పీ తెలిపారు.   

మరిన్ని వార్తలు