ఆ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు.. రూ. 2 కోట్లు!

31 May, 2016 10:05 IST|Sakshi
ఆ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు.. రూ. 2 కోట్లు!

ఎవరైనా హ్యాండ్‌బ్యాగ్ ఎంత పెట్టి కొంటారు.. మహా అయితే వెయ్యి, రెండువేలు అంతేకదా. కానీ, క్రిస్టీస్ వేలంశాలలో వేలానికి వచ్చిన ఓ హ్యాండ్‌బ్యాగ్ చరిత్ర సృష్టించింది. మొసలి చర్మంతో చేసి, వజ్రాలు, బంగారం పొదిగిన ఈ హ్యాండ్‌బ్యాగ్‌ను అక్షరాలా 2 కోట్ల రూపాయలకు కొన్నారు. ఆసియాకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి ఈ బ్యాగ్‌ను అమ్మినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచంలో అమ్ముడైన హ్యాండ్‌బ్యాగ్‌లలో ఇదే అత్యంత ఖరీదైనదని అంటున్నారు.

ఈ బ్యాగ్ కోసం హెర్మెస్ వాళ్లు తయారుచేసిన వజ్రాలు చాలా అరుదైనవని క్రిస్టీస్ వేలం శాల ఓ ప్రకటనలో తెలిపింది. ఏడాదికి ఇలాంటివి కేవలం ఒకటి లేదా రెండు వజ్రాలను మాత్రమే తయారుచేస్తారని, అది కూడా కేవలం హ్యాండ్‌బ్యాగ్‌ల కోసమే చేస్తారని చెప్పింది. ఈ వజ్రాలతో పాటు.. దాని అందచందాలు అన్నీ కలిపి ఆ బ్యాగ్‌కు అంత ధర తెచ్చిపెట్టాయన్న మాట.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా