సొంతిల్లు ఆనందమయం

28 Jan, 2017 00:33 IST|Sakshi
సొంతిల్లు ఆనందమయం

ఉప్పల్‌లో హరిహర ప్రీమియం ప్రాజెక్ట్‌
5 ఎకరాల్లో 390 ఫ్లాట్ల నిర్మాణం
ఫిబ్రవరిలో తొలి బ్లాక్‌ అప్పగింత


సాక్షి, హైదరాబాద్‌: ప్రతికూల పరిస్థితుల్లో కూడా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగే ప్రాంతాలేవైనా ఉన్నాయంటే అవి గచ్చిబౌలి, ఉప్పల్‌ కారిడార్లే. అయితే ఈ రెండు జోన్లలో ఉప్పల్‌ది కాస్త ప్రత్యేక స్థానమనే చెప్పాలి. ఎందుకంటే మెట్రో రైలు తొలిగా కూతపెట్టేది ఇక్కడి నుంచే మరి. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ను పూర్తి చేసుకొని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జాబితాలో ముందు వరుసలో నిలిచింది ఉప్పల్‌. ఈ ప్రాంతంలో అందుబాటు ధరల్లో నగరవాసుల సొంతింటి కలను సాకారం చేస్తామంటోంది శ్రీసాయి హరిహర ఎస్టేట్స్‌. ఫీర్జాదిగూడలో నిర్మిస్తున్న ఆనందమయి ప్రీమియం ప్రాజెక్ట్‌ వివరాలను సంస్థ ఎండీ ఏ యాదవ రెడ్డి
‘సాక్షి రియల్టీ’ తో పంచుకున్నారు.

ఉప్పల్‌లోని ఫిర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌ సమీపంలో 5 ఎకరాల్లో శ్రీసాయి ఆనందమయి పేరిట ప్రీమియం గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇది హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ప్రాజెక్ట్‌. 5.50 లక్షల చ.అ. స్థలం లో 7 బ్లాకుల్లో 390 ప్రీమియం ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. ఇందులో 270 రెండు పడక గదులు, 120 మూడు పడక గదుల ఫ్లాట్లుంటాయి. 1,100–1,200 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,600–1,800 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లొస్తాయి. ధర చ.అ.కు రూ.2,800. ఇప్పటికే 40 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి.

వసతుల విషయానికొస్తే.. 15 వేల చ.అ.ల్లో క్లబ్‌ హౌస్, స్విమ్మింగ్‌ పూల్, జిమ్, కమ్యూనిటీ బాంక్విట్‌ హాల్, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్‌ కోర్ట్, జాగింగ్‌ ట్రాక్, ల్యాండ్‌ స్కేపింగ్, 24 గంటల సెక్యూరిటీ వంటి అన్ని రకాల ఏర్పాట్లుంటాయి.

నిర్మాణం విషయానికొస్తే.. భూకంపాలను తట్టుకునే శక్తివంతమైన ఆర్‌సీసీ ఫ్రేమ్డ్‌ స్ట్రక్చర్, 9 ఇంచుల వెలుపలి గోడలు, నాలుగున్నర ఇంచుల లోపలి గోడలుంటాయి. వెలుపల, లోపల రెండు వైపులా డబుల్‌ సిమెంట్‌ ప్లాస్టరింగ్, ప్రధాన ద్వారంతో పాటూ లోపలి తలుపులు కలపతో, కిటికీలు యూపీవీసీతో తయారైనవి ఉంటాయి. పెయింటింగ్, టైల్స్, ఎలక్ట్రికల్, లిఫ్ట్‌ ప్రతి ఒక్కటీ బ్రాండెడ్‌ కంపెనీల ఉత్పత్తులనే వినియోగిస్తున్నాం.

ఫిబ్రవరిలో తొలి బ్లాక్‌లోని 35 ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందించనున్నాం. మరో రెండు బ్లాకుల్లో ప్లాస్టరింగ్‌ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ నాటికి 120 ఫ్లాట్లను పూర్తి చేసి కస్టమర్లకు అందిస్తాం. వచ్చే రెండున్నర ఏళ్లలో ప్రాజెక్ట్‌ మొత్తం పూర్తి చేస్తాం.

అభివృద్ధి చెందిన ప్రాంతంలో..
ఇక ప్రాజెక్ట్‌ కొలువుదీరింది కూడా వినోద, విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే సుమీ. ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి 2.5 కి.మీ. దూరంలో, డెకథ్లాన్‌లను సరిగ్గా వెనకవైపున శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్‌ ఉంది. ఏషియన్‌ సినీ స్క్వేర్, బిగ్‌బజార్, మెట్రో సూపర్‌ మార్కెట్, ఆదిత్య, స్పార్క్‌ ఆసుపత్రులు, గ్లోబల్‌ ఇండియన్, శ్రీచైతన్య టెక్నో, లిటిల్‌ ఫ్లవర్‌ వంటి విద్యా సంస్థలు.. ఇవన్నీ ప్రాజెక్ట్‌ 2–3 కి.మీ. దూరంలో ఉన్నవే.

మరిన్ని వార్తలు