హార్లీ డేవిడ్‌సన్‌ 2 మోడళ్ల ధరలు తగ్గాయ్‌..

19 Sep, 2017 13:33 IST|Sakshi
హార్లీ డేవిడ్‌సన్‌ 2 మోడళ్ల ధరలు తగ్గాయ్‌..

రూ.2.5 లక్షల వరకు కోత
న్యూఢిల్లీ:
అమెరికాకు చెందిన కల్ట్‌ బైక్స్‌ తయారీ కంపెనీ హార్లీ డేవిడ్‌సన్‌ తాజాగా ఫ్యాట్‌ బాయ్, హెరిటేజ్‌ సాఫ్టైల్‌ క్లాసిక్‌ మోడళ్ల ధరలను రూ.2.5 లక్షల వరకు తగ్గించింది. ఫ్యాట్‌ బాయ్‌ ధర రూ.2,01,010 తగ్గుదలతో రూ.17,01,000 నుంచి రూ.14,99,990కు దిగింది. ఇక హెరిటేజ్‌ సాఫ్టైల్‌ క్లాసిక్‌ ధర రూ.2,50,010 తగ్గింది. దీంతో దీని ధర రూ.18,50,000 నుంచి రూ.15,99,990కి వచ్చి చేరింది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి. 2017 ఎడిషన్స్‌కు మాత్రమే వర్తించే ఈ ధరల తగ్గింపు నిర్ణయం సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిందని సంస్థ తెలిపింది. స్టాక్‌ ఉన్నంత వరకే తగ్గింపు ఉంటుందని పేర్కొంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా