హార్లీ డేవిడ్సన్ నుంచి 3 కొత్త మోడళ్లు

31 Oct, 2014 00:29 IST|Sakshi
హార్లీ డేవిడ్సన్ నుంచి 3 కొత్త మోడళ్లు

ముంబై: హార్లీ డేవిడ్సన్ కంపెనీ మూడు కొత్త బైక్‌లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు బైక్‌ల్లో చేతితో తయారైన సీవీఓ లిమిటెడ్ బైక్ కూడా ఉందని హార్లీ డేవిడ్సన్ మేనేజింగ్ డెరైక్టర్ అనూప్ ప్రకాశ్ చెప్పారు. ఈ బైక్ ధర రూ.49.23 లక్షలు (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)అని పేర్కొన్నారు. 

మరో రెండు బైక్‌లు-బ్రేకవుట్ (ధర రూ.16.28 లక్షలు), స్ట్రీట్ గ్లైడ్ స్పెషల్ (రూ.29.70 లక్షలు)లను కూడా అందిస్తున్నామని చెప్పారు.  తాజాగా అందిస్తున్న ఈ మూడు బైక్‌లతో కలుపుకొని తాము భారత్‌లో విక్రయిస్తున్న మొత్తం మోడళ్ల సంఖ్య 13కు పెరిగిందని పేర్కొన్నారు. వీటిల్లో తొమ్మిందింటిని భారత్‌లోనే అసెంబుల్ చేస్తున్నామని, మూడింటిని దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు