ప్రముఖ ఐటీ సంస్థలో 30వేల ఉద్యోగాలు

25 Oct, 2018 16:32 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్‌ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించు కోనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా స్టాక్‌ (అబ్‌స్ట్రాక్ట్‌ డేటా) ఇంజనీర్లను నియమించుకుంటామని తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన గైడెన్స్‌ ప్రకారం వృద్ధిరేటును సాధించేందుకు 25-30వేల వరకు ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంటామరని హెచ్‌సీఎల్‌ హెచ్‌ఆర్‌ విభాగం ముఖ్య అధికారి వి అప్పారావు ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అమెరికాలో స్థానికులకు 65శాతం ప్రాధాన్యత నిచ్చిన నేపథ్యంలో డిపెండెన్స్‌ వీసాలు బాగా తగ్గాయన్నారు. దీంతోపాటు వీసాల జారీ అస్యంగా కారణంగా హెచ్‌1బీ , ఎల్‌1బీ వీసాల సంఖ్య క్షీణించిందని అప్పారావు వెల్లడించారు. ఈ ఏడాది 640హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తు చేయగా 400మందికి అనుమతి లభించినట్టు తెలిపారు. సెప్టెంబరు 30నాటి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12875 ఉండగా క్యూ2లో అదనంగా మరో 3754మంది చేరారని కంపెనీ ఫలితాల సందర్భంగా వివరించింది.

మరిన్ని వార్తలు