హెచ్‌సీఎల్‌ లాభం డౌన్‌..గైడెన్స్‌ భేష్‌

27 Jul, 2017 13:50 IST|Sakshi

ముంబై: ఐటీ మేజర్‌ , సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్ ప్రొవైడర్  హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తొలి త్రైమాసికంలో  లాభాలు భారీగా  క్షీణించాయి. గురువారం  ప్రకటించిన క్వార్టర్‌ 1 ఫలితాల్లో  నికర లాభాలు 11 శాతం పడిపోయాయి. సీక్వెన్షియల్‌  లాభాలు  6.6 శాతం  క్షీణించి  రూ.2,171 కోట్లకు పడిపోయాయి. తక్కువ ఆదాయం  అధిక పన్ను వ్యయంతో  హెచ్‌సీఎస్‌ ఫలితాలు ప్రభావితమైనట్టు అంచనా.  అయితే బెటర్‌ ఆపరేషనల్‌  పెర్‌ఫామెన్స్‌ కారణంగా  కంపెనీ వృద్ధి క్షీణతకు బ్రేక్‌ వేసింది.

అయితే   ఎబిటా మార్జిన్లు  1.6 వృద్ధిని నమోదు చేసి రూ. 2,444 కోట్లను  సాధించింది. మార్జిన్‌లు 20.1 శాతం పుంజుకున్నాయి.  వీటిని 19.5 పెరిగి రూ.2383గా ఉంటుందని  విశ్లేషకులు అంచనావేశారు.  ఈ  త్రైమాసికంలో ఆదాయం 0.8 శాతం పెరిగి రూ .12,149 కోట్లకు చేరింది.  డాలర్ల ఆదాయం 3.7 శాతం పెరిగి 1,884.2 మిలియన్ డాలర్లకు చేరింది.    2018 ఆర్థిక సం.రం గైడెన్స్‌ను 10.5-12.5 గా ప్రకటించింది.  దీంతో  హెచ్‌సీఎల్‌  టెక్‌ 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది.  హెచ్‌సీఎల్‌ కౌంటర్‌ 4 శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది.
 1-2-3 పెరుగుదల వ్యూహంలో ముందుకు సాగుతున్నామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్  సీఈవో విజరుకుమార్ చెప్పారు.  డాలర్‌  పరిధిలో క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ 2.6శాతం, ఇయర్‌ ఆన్‌ ఇయర్‌  12.2 శాతం రెవెన్యూ వృద్ధిని  సాధించామన్నారు.  అయితే  2018 ఆర్థిక సంవత్సరంలో  మెరుగైన గైడెన్స్‌ను ప్రకటించడం విశేషం.
 

>
మరిన్ని వార్తలు