అంచనాలను అందుకోలేని హెచ్ సీఎల్

28 Apr, 2016 16:50 IST|Sakshi

భారత బహుళ జాతి టెక్నాలజీ సంస్థ హెచ్ సీఎల్ ఈ త్రైమాసింకంలో మార్కెట్ నిపుణుల అంచనాలను అందుకోలేకపోయింది. వారి అంచనాలను తాకలేక జనవరి-మార్చి త్రైమాసికంలో కేవలం 0.3శాతం నికర ఆదాయాలనే నమోదుచేసింది. క్యూ3లో రూ.1,939 కోట్లగా ఉంటాయనుకున్న నికరలాభాలను రూ. 1926 కోట్లగానే కంపెనీ ఫలితాలు చూపించాయి. అంచనాలకు కిందగానే అమ్మకాలను సైతం రూ.10,698 కోట్లగా నమోదుచేశాయి. ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల రెవెన్యూ వృద్ధి కంటే తక్కువగా కేవలం 11.6శాతం రెవెన్యూ వృద్దినే హెచ్ సీఎల్ చూపించింది. హెచ్ సీఎల్ గురువారం(నేడు) ఆశించిదగ్గ ఫలితాలను విడుదల చేయకపోవడంతో, మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు 5శాతం మేర పడిపోయాయి. బీసీఎస్ ఈ సెన్సెక్స్ లో రూ.799.30 వద్ద నమోదైంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ట్రేడింగ్ లో  టాప్ లూజర్ నమోదైన హెచ్ సీఎల్ 1.4 శాతం పడిపోయింది.  

 

మరిన్ని వార్తలు