హెచ్‌సీఎల్ చేతికి వోల్వో ఐటీ వ్యాపారం

21 Oct, 2015 02:32 IST|Sakshi
హెచ్‌సీఎల్ చేతికి వోల్వో ఐటీ వ్యాపారం

డీల్ విలువ రూ.895 కోట్లు
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన వాణిజ్య వాహనాల దిగ్గజం వోల్వో గ్రూప్‌కు చెందిన ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేయనున్నది. వోల్వో ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీ సంస్థ రూ.895 కోట్లకు కొనుగోలు చేస్తోందని, దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నామని వోల్వో గ్రూప్ తెలిపింది. ఈ డీల్ అంతా నగదు రూపేణా జరుగుతుందని పేర్కొంది.  అంతేకాకుండా వోల్వో గ్రూప్ ఐటీ ఇన్‌ఫ్రా కార్యకలాపాలను ఐదేళ్లపాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చామని తెలిపింది.

దీనికి సంబంధించిన అర్థిక వివరాలను మాత్రం వొల్వో గ్రూప్ వెల్లడించలేదు. ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్‌కు విక్రయించడం వల్ల 2,600 మంది ఐటీ సిబ్బందిపై ప్రభావం పడుతుందని, హెచ్‌సీఎల్‌లో పనిచేసే అవకాశాన్ని వారికి కల్పించామని వివరించింది. ఐటీ వ్యాపార విక్రయం వొల్వో గ్రూప్‌కు ప్రయోజనకరమేనని వోల్వో సీఎఫ్‌ఓ, తాత్కాలిక ప్రెసిడెంట్ జాన్ గారండర్ పేర్కొన్నారు. వోల్వో సంస్థతో జట్టు కట్టడం అదనపు విలువను సృష్టించడానికి తమకు దక్కిన ఒక మంచి అవకాశమని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత గుప్తా చెప్పారు. ఈ డీల్ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 0.7 శాతం వృద్దితో రూ.864 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు