అంచనాలను అధిగమించిన టెక్ దిగ్గజం

11 May, 2017 10:43 IST|Sakshi
అంచనాలను అధిగమించిన టెక్ దిగ్గజం
దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసుల సంస్థ హెచ్సీఎల్ అంచనాలను అధిగమించింది. అంచనావేసిన దానికంటే మెరుగ్గా నాలుగో క్వార్టర్ కన్సాలిడేటెడ్ లాభాల్లో 28 శాతం పైకి ఎగిసింది. మార్చితో ముగిసిన క్వార్టర్ లో రూ.2,475 కోట్ల లాభాలను నమోదుచేసింది. ముందటి ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్ లో ఈ లాభాలు రూ.1,939 కోట్లగా ఉన్నాయి. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం  ఈ టెక్ దిగ్గజం రూ.2,091 కోట్ల లాభాలను నమోదుచేస్తుందని అనాలిస్టులు అంచనావేశారు. లాభాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో కంపెనీ మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది. 2017-18 సంవత్సరానికి గాను రెండు రూపాయలు కలిగి ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుకు ఆరు రూపాయల మధ్యంతర డివిడెండ్ ను బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించినట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 20 శాతం పైగా పెరిగి, రూ.13,183 కోట్లగా రికార్డైనట్టు క్వార్టర్ రివ్యూలో తెలిసింది.
 
ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.10,925 కోట్లగా ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను, కంపెనీ నికర లాభాలు 53 శాతం పైగా పెరిగి రూ.8606.47 కోట్లగా, మొత్తం ఆదాయం 52 శాతం పెరిగి రూ.48,640.85 కోట్లగా రికార్డయ్యాయి. స్థిరమైన కరెన్సీ విలువల్లో 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూలు 10.5-12.5 శాతం పెరుగుతుందని కంపెనీ అంచనావేస్తోంది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా 19.5-20.5 శాతం రేంజ్ లో ఉంటాయని పేర్కొంది. 2017 మార్చి క్వార్టర్ ముగింపుకు కంపెనీలో 1,15,973 ఉద్యోగులున్నారు. తమ ఐటీ సర్వీసుల అ‍ట్రిక్షన్ 12 నెలల కాలంలో 16.9 శాతంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఇది ముందటి ఏడాది కంటే తక్కువనేని పేర్కొంది. 
 
మరిన్ని వార్తలు