త్వరలో హెచ్‌డీబీ ఐపీఓ !

27 Jun, 2019 12:15 IST|Sakshi

ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉండొచ్చు

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్ల నియామకం !   

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. 2007లో ప్రారంభమైన హెచ్‌డీబీ వ్యక్తిగత రుణాలతో పాటు, వాణిజ్య వాహనాలతో పాటు, బంగారంపై రుణాలివ్వటం చేస్తోంది. ఆస్తులు తనఖాగా కూడా రుణాలిస్తోంది. కాగా హెచ్‌డీబీ ఐపీఓ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత నెల రోజులుగా వివిధ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ ఐపీఓ ద్వారా రూ.7,000– 8,000 కోట్ల మేర నిధులు సమీకరించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భావిస్తోందని,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐపీఓ ఉండొచ్చని అంచనా. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు  95.53 శాతం వాటా ఉంది. హెచ్‌డీబీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయితే స్టాక్‌మార్కెట్లో లిస్టైన హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ కంపెనీల సంఖ్య ఐదుకు చేరుతుంది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లు లిస్టయ్యాయి.

>
మరిన్ని వార్తలు