హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు బిగ్‌ బొనాంజ

26 Oct, 2017 13:06 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన ఉద్యోగులకు బిగ్‌ బొనాంజ ప్రకటించింది. తన ఉద్యోగులకు 20 లక్షలకు పైగా ఈక్విటీ షేర్లను జారీ చేస్తున్నట్టు బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఆప్షన్స్‌ స్కీమ్స్‌(ఈఎస్‌ఓఎస్‌) కింద ఉద్యోగులకు 20,56,400 ఈక్విటీ షేర్లను గురువారం జారీచేస్తున్నట్టు బ్యాంకు తన ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో బ్యాంకు పెయిడ్‌ అప్‌ షేర్‌ క్యాపిటల్‌ రూ.516,79,93,234 నుంచి రూ.517,21,06,034 పెరిగినట్టు వెల్లడించింది. ఒక్కో షేరు విలువ రెండు రూపాయలు.

నేటి మార్కెట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 0.63 శాతం పైకి ట్రేడవుతున్నాయి. మొత్తంగా ఉద్యోగులకు అందించిన షేర్ల విలువ రూ.370 కోట్లకు పైగా ఉంది. తాజాగా ప్రకటించిన సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ అంచనాలను తాకింది. బ్యాంకు వడ్డీ ఆదాయాలు 15 శాతం పెరిగి రూ.19,670 కోట్లకు పెరిగినట్టు రిపోర్టు చేసింది. 

మరిన్ని వార్తలు