నంబర్‌1 బ్రాండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే

14 Sep, 2017 01:02 IST|Sakshi
నంబర్‌1 బ్రాండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే

ముంబై: దేశంలోని గొప్ప బ్రాండ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నంబర్‌ 1 గా తన స్థానాన్ని కాపాడుకుంది. దేశంలో అత్యంత విలువైన మొదటి 50 బ్రాండ్ల వివరాలను ‘బ్రాండ్జ్‌ ఇండియా టాప్‌ 50’ పేరుతో ప్రకటనల సంస్థ డబ్ల్యూపీపీ, పరిశోధనా సంస్థ కంటార్‌ మిల్‌వర్డ్‌ బ్రౌన్‌ సంస్థలు బుధవారం ముంబైలో ప్రకటించాయి. ఈ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నంబర్‌ 1 స్థానంలో కొనసాగడం వరుసగా నాలుగో ఏడాది. 2014 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన బ్రాండ్‌ విలువను 9.4 బిలియన్‌ డాలర్ల నుంచి 18 బిలియన్‌ డాలర్లకు పెంచుకుంది.

 కొత్తగా జాబితాలో 7 సంస్థలకు చోటు దక్కింది. టెలికంలోకి కొత్తగా ప్రవేశం చేసిన రిలయన్స్‌ జియో 11వ స్థానం సంపాదించింది. ఇంకా డీమార్ట్, వర్ల్‌పూల్, బజాజ్‌ అలియాంజ్, కెనరా బ్యాంకు, సన్‌ డైరెక్ట్, డిష్‌టీవీలు కొత్తగా జాబితాలోకి వచ్చిన వాటిలో ఉన్నాయి. భారత కస్టమర్లు కచ్చితత్వంతోపాటు డబ్బుకు తగ్గ విలువను చూస్తున్నారని పరిశోధనా సంస్థ కంటార్‌ మిల్‌వర్డ్‌ బ్రౌన్‌ తెలిపింది. భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్ల విలువ గత ఏడాదిలో 21% పెరిగి 109.3 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు ఈ నివేదిక వెల్లడించింది.

మరిన్ని వార్తలు