హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం 20% అప్

22 Oct, 2015 00:39 IST|Sakshi
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం 20% అప్

ముంబై: దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో రెండవ అతిపెద్దదైన
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో
(జూలై-ఆగస్టు-సెప్టెంబర్) భారీగా 20.5% పెరిగింది.
విలువలో ఈ మొత్తం రూ. 2,869 కోట్లు. 2014-15 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.2,382 కోట్లు.
ఆర్థిక ఫలితాల్లో ముఖ్యాంశాలు...
     
రిటైల్ రుణాలు భారీ లాభాలకు కారణం
ఆదాయం రూ. 13,895 కోట్ల నుంచి 25% వృద్ధితో రూ. 17,324 కోట్లకు పెరిగింది.
వ్యయాలు 25 శాతం పెరిగాయి. రూ. 9,835 కోట్ల నుంచి రూ. 12,281 కోట్లకు ఎగశాయి.
స్థూల మొండిబకాయిలు 1 శాతం నుంచి 0.9 శాతానికి దిగాయి.
నికర మొండిబకాయిలు 0.2 శాతం.
నికర వడ్డీ ఆదాయం 21.2 శాతం వృద్ధితో రూ.6,681 కోట్లుగా ఉంది.
సెప్టెంబర్ నాటికి బ్యాంక్ 4,227 బ్రాంచీలు. 11,686 ఏటీఎంలను బ్యాంక్ కలిగి ఉంది.
బుధవారం బీఎస్‌ఈలో బ్యాంక్ షేర్ ధర స్వల్పంగా 0.01 శాతం పెరిగి రూ.1,095 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు