హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు భళా: లాభం 20శాతం జంప్‌

19 Jan, 2018 13:22 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. డిసెంబర్‌ 31తో ముగిసి క్యూ3 లో నికర లాభం భారీగా జంప్‌ చేసింది. శుక్రవారం ప్రకటించిన  ఫలితాల్లో  బ్యాంకు నికర లాభం 20 శాతం  ఎగిసి  రూ. 4643 కోట్లను సాధించింది.  గత ఏడాది ఇదే క్వార్టర్‌లో 3,865 కోట్ల  రూపాయలను  ఆర్జించింది.  నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 24 శాతం పెరిగి రూ. 10,314 కోట్లను తాకింది.

త్రైమాసిక ప్రాతిపదికన బ్యాంక్‌ స్థూల  మొండిబకాయిలు(ఎన్‌పీఏలు)  స్వల్పంగా పెరిగాయి.   గత క్వార్టర్‌1.26 శాతంతో పోలిస్తే ఈ క్వార్టర్‌లో  1.29 శాతానికి  చేరాయి..  నికర ఎన్‌పీఏలు సైతం 0.43 శాతం నుంచి నామమాత్రంగా 0.44 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు రూ. 1476 కోట్ల నుంచి రూ. 1351 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలోహెచ్‌డీఎఫ్‌సీ కౌంటర్‌ భారీ లాభాలతో  రూ. 1958 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. మరోవైపు దేశ మార్కెట్‌ చరిత్రలో రూ. 5 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను సాధించిన మూడో సంస్థగా హెచ్‌డీఎఫ్‌సీ రికార్డు  సాధించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు