3వ రోజూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జోరు

20 Jul, 2020 13:44 IST|Sakshi

4 శాతం జంప్‌చేసిన షేరు

3 రోజుల్లో 10 శాతం ప్లస్‌

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించిన ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వరుసగా మూడో రోజు లాభాల బాటలో సాగుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 1,145 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,153 వరకూ ఎగసింది. వెరసి మూడు రోజుల్లో 10 శాతం పురోగమించింది. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.41 కోట్ల షేర్లు చేతులు మారాయి. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.62 కోట్ల షేర్లు మాత్రమే.

20 శాతం అప్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 6659 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 15,665 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.3 శాతం వద్ద నిలకడను చూపాయి. స్థూల మొండిబకాయిలు నామమాత్రంగా పెరిగి 1.4 శాతంగా నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు