హెచ్‌డీఎఫ్‌సీకి కన్సల్టెన్సీ సంస్థ టోకరా

30 Oct, 2018 15:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   ప్రముఖ ప్రయివేటురంగ  బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీకి  ఉద్యోగ కన్సల్టెన్సీ సంస్థ భారీ టోకరా ఇచ్చింది.  నకిలీ ఆదాయ పత్రాలు, ఇతర దొంగ సర్టిఫికెట్లతో  బ్యాంకులో ఉద్యోగాలను సాధించింది.  బ్యాంకు మేనేజర్‌ స్థాయినుంచి ఇతర  ఉద్యోగాలను ఇలా అక్రమ పద్ధతుల్లో సాధించింది.  ఈ విషయాన్ని ఆలస్యంగా గు​ర్తించిన బ్యాంకు   సదరు కన్సల్టెన్సీ సంస్థపై కేసు నమోదు చేసింది.

గుర్గావ్‌ కు చెందిన  అడెకో కన‍్సల్టెన్సీ ఈ మోసానికి పాల్పడింది.  అక్రమ పద్దతుల్లో బ్యాంకు మేనేజర్ సహా 68 ఉద్యోగులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సాధించింది. ఇందుకు సదరు అభ్యర్థులనుంచి భారీ ఎత్తున డబ్బులను తీసుకుంది.  నకిలీ సాలరీ స్లిప్పులు, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్ల ద్వారా ఈ ఉద్యోగాలను  పొందిందని బ్యాంకు ఆరోపించింది.

2017, ఫిబ్రవరిలో  గీతాంజలి బగ్గా అసిస్టెంట్‌ మ్యానేజర్‌గా ఉద్యోగం  పొందారు. అయితే రిఫరెన్స్‌ తనిఖీలో  ఆ ఉద్యోగి నకిలీ సర్టిఫికెట్లు చూపించినట్టు తేట తెల్లమైంది.  ఈ సందర‍్భంగా నిర్వహించిన అంతర్గత విచారణలో అడెకో కన్సల్టెన్సీకి చెందిన  అమిత్‌ చౌదరి అనే వ్యక్తికి రూ. 60వేలు చెల్లించినట్లు బగ్గా వెల్లడించారు.  దీంతో తీగ లాగితే.. మిగతా 68 మంది ఉద్యోగుల డొంక కదిలింది. ఇలా మాజీ మేనేజర్ సత్యేంద్ర తన ఎంపికకు రూ .1.45 లక్షలు చెల్లించారని స్పష్టమైంది. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన హెచ్‌డీఎఫ్‌సీ అమిత్ చౌదరి సహా, బ్యాంకు ఉద్యోగులు  కోహల్ కుష్వాహా, విశాల్ పాండేలపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు