మహిళలకు ‘మై హెల్త్‌ ఉమెన్‌ సురక్షా’ ప్లాన్‌

5 Dec, 2019 06:35 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఆవిష్కరణ

మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర వైద్య బీమా పథకం ‘మై హెల్త్‌ ఉమెన్‌ సురక్షా’ను ప్రముఖ బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఆవిష్కరించింది. మహిళల జీవితంలో వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు, అనారోగ్య సమస్యల సమయంలో ఆర్థిక సాయంతో అదుకునేలా ఈ పాలసీని కంపెనీ రూపొందించింది. పాలసీ రెన్యువల్‌ సమయంలో మహిళల ఫిట్‌నెస్‌ (శారీరక, మానసిక ధృడత్వం) ఆధారంగా తగ్గింపు ఇస్తుంది.వ్యాధి నిరోధక ముందస్తు వైద్య పరీక్షలు, హెల్త్‌ కోచింగ్, పోషకాహారం, సరైన స్థాయిలో బరువు ఉండేలా చూడడం తదితర అంశాల్లో వివరాలు అందిస్తుంది.

ఫార్మసీ కొనుగోళ్లపైనా తగ్గింపులు ఇస్తుంది. గర్భధారణ సమ యంలో కౌన్సెలింగ్, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం.. ఇలా ఎన్నో అంశాల్లో హెచ్‌డీ ఎఫ్‌సీ ఎర్గో ‘మై హెల్త్‌ ఉమెన్‌ సురక్షా’ పాలసీ దారులకు చేదోడుగా ఉంటుంది. 18–65 సంవత్సరాల వయసు లోని వారు పాలసీకి అర్హులు. ‘‘మహిళలు భిన్న వయసుల్లో ఎన్నో రిస్క్‌లను ఎదుర్కొం టున్నారు. వీటిల్లో కేన్సర్, గుండె జబ్బులు, గర్భధారణ సమయంలో ప్రాణ ప్రమాదం ఇలా ఎన్నో అవసరాల్లో మద్దతుగా నిలిచేలా మై హెల్త్‌ ఉమెన్‌ సురక్షా ప్లాన్‌ ను రూపొం దించాం’’ అని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఎండీ, సీఈవో రితేష్‌ కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు