7రోజుల నష్టాలకు బ్రేక్‌: ఫార్మ, బ్యాంకింగ్‌ జోష్‌

8 Feb, 2018 16:20 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  గురువారం భారీగా రీబౌండ్‌ అయ్యాయి. గత ఏడు సెషన్లుగా  భారీగా కుదేలవుతున్న సూచీలు  చివరికి లాభాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టార్లలో  కొనుగోళ్ల ధోరణి కనిపించింది. దీంతో  రోజంతా భారీ లాభాలతో కదిలాడిన  సెన్సెక్స్‌ 330 పాయింట్లు జంప్‌చేసి 34,413 వద్ద ,  నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి  10,577 వద్ద  ముగిసింది.   ఫార్మ టాప్‌ విన్నర్‌గా ఉండగా పీఎస్‌యూ బ్యాంక్స్,  రియల్టీ ,  మెటల్‌, ఐటీ, ఆటో రంగాల​ షేర్లులాభపడ్డాయి.  ప్రధానంగా సన్ ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ఇండెక్స్ హెవీవెయిట్స్‌ బాగా లాభపడ్డాయి.   సిప్లా, అంబుజా, ఇన్‌ఫ్రాటెల్‌, ఐబీ హౌసింగ్‌, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌  లాభాల్లో, అరబిందో, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, టాటా మోటర్స్‌, హిందాల్కో  నష్టాల్లోనూ ముగిశాయి.
 
 

మరిన్ని వార్తలు