ఏసీసీ, శ్రీ సిమెంట్స్‌ షేర్లపై ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ బుల్లిష్‌

27 May, 2020 11:52 IST|Sakshi

సిమెంట్‌ షేర్లపై ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ ‘‘బై’’ రేటింగ్‌

నిఫ్టీకి రానున్న రోజుల్లో 8800- 9300 శ్రేణిలో కీలకం కానుందని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ అంచనా వేస్తున్నారు. అలాగే వచ్చే రోజుల్లో బుల్స్‌, బేర్స్‌ మధ్య భీకరపోరు కొనసాగుతుందని, మార్కెట్‌ అధిక స్థాయిలో ఒత్తిడి ఎదుర్కోనే అవకాశం ఉందని గాంధీ అంటున్నారు. స్టాక్‌-నిర్దేశిత యాక్షన్‌ ట్రేడింగ్‌తో మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోందని అంటున్నారు.  డౌన్‌ సైడ్‌లో, నిఫ్టీ 8800 స్థాయిని కోల్పోతే అమ్మకాలు మరింత తీవ్రతరం కావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నిఫ్టీ ఇండెక్స్‌ 8600 స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇక అప్‌సైడ్‌ ట్రెండ్‌లో...  నిప్టీకి 9300 వద్ద కీలకమైన మద్దతు స్థాయి ఉంది. ఈ స్థాయిలో కాల్‌ రైటర్స్‌ ఇక్కడ షార్ట్‌ కవరింగ్‌ చూడవచ్చని గాంధీ అభిప్రాయపడ్డారు.  ఈ నేపథ్యంలో షితిజ్ గాంధీ సిమెంట్‌ షేర్లపై తన సమగ్ర విశ్లేషణలను వివరించారు.  

షేరు పేరు: ఏసీసీ సిమెంట్స్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.1,425
స్టాప్‌ లాస్‌: రూ.1150
అప్ ‌సైడ్‌: 12శాతం

విశ్లేషణ: రూ.950ల నుంచి వీ-ఆకారపు రివకరీ తరువాత, స్టాక్‌ మంగళవారం డైలీ ఛార్ట్‌లో 100 రోజుల ఎక్స్‌పోనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ అధిగమించగలిగింది. షేరు గత  నాలుగు వారాల నుంచి రూ.1100- రూ.1250ల స్థాయిలో కన్సాలిడ్‌ అయ్యింది. ఈ వారంలో స్టాక్‌ సుధీర్ఘ కన్సాలిడేషన్‌ తర్వాత నిర్వచించిన పరిధి కంటే కొత్త బ్రేక్ అవుట్ను చూసింది. పెరుగుతున్న ధరలతో పాటు పెరుగుతున్న వాల్యూమ్‌లు స్టాక్‌ అప్‌ట్రెండ్‌ ర్యాలీని సూచిస్తున్నాయి. కావున ట్రేడర్లు రూ.1150 స్థాయిని స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.1,425 టార్గెట్‌ ధరగా పెట్టుకొని రూ.1250-1260 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు.


షేరు పేరు: శ్రీ సిమెంట్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.23600 
స్టాప్‌ లాస్‌: రూ.18500
అప్‌ సైడ్‌: 15శాతం 

విశ్లేషణ: రూ.18,000-20,000 స్థాయిలో ఐదు వారాల పాటు సుధీర్ఘ కన్సాలిడేషన్‌ తరువాత, డైలీ ఛార్ట్‌లో నిర్వచించిన పరిధి కంటే సరికొత్త బ్రేక్అవుట్ ఇచ్చింది. అలాగే  డైలీ చార్టులలో దాని 200 రోజుల ఎక్స్‌పోనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ను  అధిగమించగలిగింది. ఇక టెక్నికల్‌గా పరిశీలిస్తే.., దీర్ఘచతురస్ర ప్యాట్రన్‌పైన బ్రేక్‌ అవుట్‌ను చూడవచ్చు. ఇది సాధారణంగా కొనసాగింపు ప్యాట్రన్‌గా ట్రేడ్‌  చేయబడుతుంది. కావున ట్రేడర్లు రూ.18,500 స్థాయిని స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.23,600 టార్గెట్‌ ధరగా పెట్టుకొని రూ.20,500-20,650 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. 

మరిన్ని వార్తలు