తగ్గిన హెరిటేజ్‌ లాభం

11 Aug, 2017 01:51 IST|Sakshi
తగ్గిన హెరిటేజ్‌ లాభం

తొలి త్రైమాసికంలో 53 శాతం డౌన్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ నికరలాభం 2017–18 తొలి త్రైమాసికంలో 53 శాతం తగ్గింది. గతేడాది ఇదే కాలంతో ఆర్జించిన స్టాండలోన్‌ నికరలాభం రూ.16.4 కోట్లతో పోలిస్తే... ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌– జూన్‌) కేవలం రూ.7.64 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 32 శాతం వృద్ధి చెంది రూ.610.74 కోట్ల వద్ద నిలిచింది.

రూ.10 ముఖ విలువ కలిగిన ఒకో ఈక్విటీ షేరును రూ.5 ముఖ విలువ కలిగిన రెండు షేర్లుగా విభజించేందుకు (స్ప్లిట్‌) బోర్డు ఆమోదించింది. హెరిటేజ్‌ సంస్థ ఫ్రాన్స్‌కు చెందిన నొవాన్‌డీ ఎస్‌ఎన్‌సీతో కలసి 50:50 జాయింట్‌ వెంచర్‌గా రూ.16 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఫ్లేవర్డ్‌ యుగార్ట్, వెస్ట్రన్‌ డిస్సెర్ట్స్‌ను తయారు చేస్తోంది. ఈ ఉత్పత్తులను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనుంది.

మరిన్ని వార్తలు