హీరో గ్లోబల్‌ రికార్డ్‌

21 Oct, 2017 04:01 IST|Sakshi

ఒక్కరోజే 3 లక్షల యూనిట్ల విక్రయాలు

హైదరాబాద్‌: దేశీ దిగ్గజ టూవీలర్‌ కంపెనీ ‘హీరో మోటొకార్ప్‌’.. ధంతెరాస్‌ రోజు (అక్టోబర్‌ 17) ఏకంగా 3 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది. ఇది అంతర్జాతీయ రికార్డ్‌. ‘కేవలం ఒకరోజులోనే 3 లక్షలకుపైగా వాహనాలను విక్రయించాం. ప్రపంచంలో ఈ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించాం’ అని హీరో మోటొకార్ప్‌ పేర్కొంది.

ఈ పండుగ సీజన్‌ తమకు బ్లాక్‌బ్లాస్టర్‌ జ్ఞాపకాలను మిగిల్చిందని తెలిపింది. సెప్టెంబర్‌ నెలలో 7 లక్షల యూనిట్లను విక్రయించామని పేర్కొంది. నెలవారీ అమ్మకాల్లో ఇవే ఇప్పటి వరకు అత్యుత్తమ గణాంకాలని తెలిపింది. రెండో త్రైమాసికంలో 20 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించామని పేర్కొంది. కంపెనీ ఏర్పాటు నుంచి చూస్తే 7.5 కోట్లకుపైగా యూనిట్లను విక్రయించామని తెలిపింది.

మరిన్ని వార్తలు