హీరో మోటో వాహన ధరల పెంపు

26 Sep, 2018 18:26 IST|Sakshi

రుపీ , కమోడిటీ కాస్ట్‌ సెగ

పండగ సీజన్‌లో  బైక్‌ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

​హీరోమోటో స్కూటర్లు, బైక్స్‌ ధర పెంపు

అక్టోబర్‌ 3నుంచి సవరించిన ధరలు అమల్లోకి

సాక్షి, ముంబై : ప్రపంచ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్‌  ఫెస్టివ్‌ సీజన్‌లో వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. సంస్థకు  చెందిన అన్ని మోటార్ సైకిల్స్, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం  ప్రకటించింది.  దేశీయ కరెన్సీ విలువ క్షీణత, కమోడిటీ వస్తువల ధర పెరుగుదల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.  ఈ పెంపు అక్టోబర్‌ 3వ తేదీని అమల్లోకి రానున్నట్టు తెలిపింది.  900 రూపాయల దాకా ఈ పెంపు ఉంటుందని, ఆయా  మార్కెట్లు,  మోడళ్ళ ఆధారంగా సవరించిన ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది.

మరిన్ని వార్తలు