హీరో మోటో తొలి బీఎస్-6  బైక్‌ 

7 Nov, 2019 18:24 IST|Sakshi

సాక్షి, ముంబై : హీరో మోటో కార్ప్ ప్రీమియం  బైక్‌ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బీఎస్-6 నిబంధనలకనుగుణంగా భారతదేశపు మొట్టమొదటి మోటారు సైకిల్ ‘స్పెండర్ 110 సిసి ఐస్మార్ట్‌’  పేరుతో  లాంచ్‌ చేసింది. దీని ధరను  రూ .64,900 గా నిర‍్ణయించింది. హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ రిటైల్ అమ్మకాలు మరికొన్ని రోజుల్లో  ఢిల్లీ,  నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) లో ప్రారంభం కానున్నాయి. రాబోయే కొద్ది వారాల్లో ఇది క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. 

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో తాజా లాంచ్‌తో తన మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. 110 సీసీ  బీఎస్-6 కంప్లైంట్ ఫ్యూయల్ ఇంజెక్షన్, 9 గరిష్ట బిహెచ్‌పి వద్ద 7500 ఆర్‌పిఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.89 ఎన్‌ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. స్ప్లెండర్ ఐస్మార్ట్ దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులో ఉంటుంది. హీరో మోటోకార్ప్  ప్రతినిధి సంజయ్ భన్ తెలిపారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రపంచంతో సమానంగా ఉంచే బీఎస్‌-6 ఉద్గార నిబంధనలు 2020 ఏప్రిల్ 1 నుండి అధికారికంగా అమలులోకి  రానున్నసంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు