హోండాకు ఝలక్‌: హీరో కొత్త స్కూటర్లు

14 Aug, 2017 14:10 IST|Sakshi
హోండాకు ఝలక్‌: హీరో కొత్త స్కూటర్లు

ద్విచక్ర వాహన  తయారీదారు  హీరో మోటోకార్ప్  సరికొత్త వ్యూహంతో బైక్‌ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. అలాగే స్కూటర్ల విభాగంలో ప్రత్యర్థి  హోండాకు గట్టి పోటీ ఇవ్వాలని  నిర్ణయించుకుంది.   మార్కెట్‌ లీడర్‌గా  తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ ప్రీమియం బైక్ సెగ్మెంట్ మరియు స్కూటర్లపై దృష్టి సారించింది.  ఈ నేపథ్యంలో 2018-19 నాటికి రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.  గత ఆర్థిక సంవత్సరం హోండా స్థానంలో తన స్థానాన్ని పెంచే వ్యూహంలో భాగంగా మూడు కొత్త స్కూటర్ల మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కొత్త 125 సిసి స్కూటర్ను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది.  ప్రీమియం మోటార్‌ సైకిల్ సెగ్మెంట్లో ఈ ఆర్థిక సంవత్సరం చివరకు మార్కెట్‌ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా  ప్రణాళికలు రచిస్తోంది.  ఈ ఏడాది చివరి నాడికి ఒక కొత్త 200 సీసీ స్పోర్ట్స్ బైక్‌ను,  వచ్చే ఏడాదిలో మరో రెండు మోడళ్లు విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్‌ కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో స్కూటర్స్‌ విభాగం 110సీసీ కెపాసిటీతో మాస్ట్రో ఎడ్జ్‌, మోడల్స్‌ ఉండగా ..100 సీసీ సామర్థ్యంతో డ్యూయెట్‌ అందుబాటులో ఉంది. అయితే హోండా కంపెనీకి స్కూటర్స్‌ విభాగంలో మంచి పట్టు ఉంది. యాక్టివా 4జీ, డియో, ఏవియేటర్‌, యాక్టివరా ఐ, క్లిక్‌ 110 సీసీ స్కూటర్స్‌ కాగా 125 సీసీ సామర్థ్యంతో యాక్టివా 125 హోండా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. దేశీయ మోటర్‌ సైకిల్స్‌ మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటా ఉన్న హీరో మోటో కార్ప్‌ కు స్కూటర్స్‌ విభాగంలో  కేవలం 12 శాతం  మాత్రమే మార్కెట్‌ షేర్‌ ఉంది. అయితే హోండాకు ఇదే విభాగంలో సుమారు 60 శాతం మార్కెట్‌ వాటా ఉండటం, మరో కంపెనీ టీవీస్‌కు 15శాతం పైగా మార్కెట్‌ వాటా ఉండటంతో హీరో కార్ప్‌ స్కూటర్స్‌ తయారీపై దృష్టి సారించింది. అయితే  ఈ వార్తలపై  సంప్రదించినప్పుడు హీరో మోటో కార్ప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

కాగా 2016-17 సంవత్సరానికి వార్షిక నివేదికలో కంపెనీ వాటాదారులకు ఇచ్చిన సందేశం లో  హీరో మోటార్‌ కార్ప్‌ సీఎండీ పవన్ ముంజాల్ మాట్లాడుతూ,  వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రీమియం, స్కూటర్ కేటగిరీలు సహా  అరడజను కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయనున్నట్టు  చెప్పారు.  ఇటీవలే హోండా మొట్టమొదటి భాగస్వామి హీరో మోటోకార్ప్‌ను అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై మాసాలలో హీరో మోటార్ కార్పొరేషన్ 24,22,650 యూనిట్లు విక్రయించింది. హోండా మోటార్స్ 19,90,438 యూనిట్లు విక్రయించింది. స్కూటర్ సెగ్మెంట్లో 21,45,491 యూనిట్లు విక్రయించగా, హెచ్ఎంఎస్ఐ 6,72,828 యూనిట్లు విక్రయించింది.  టీవీఎస్ మోటార్స్ కార్ల అమ్మకాలు బాగా క్షీణించాయి. ఏప్రిల్-జూలై త్రైమాసికంలో 3,38,723 యూనిట్లు విక్రయించింది. ఏప్రిల్-జూలై నెలలో మొత్తం స్కూటర్ల విక్రయాలు 41,03,644  యూనిట్లుగా నమోదయ్యాయి.
 

మరిన్ని వార్తలు