ఇక తగ్గింపు ధరల్లో హైఎండ్‌ బైక్స్‌

13 Feb, 2018 19:59 IST|Sakshi
ఫైల్‌ ఫోటోలు

సాక్షి, న్యూఢిల్లీ:  దిగుమతి సుంకం భారీ తగ్గింపుతో   అంతర్జాతీయ బైక్‌లు చవకగా భారతీయులకు లభించ నున్నాయి. హర్లే డేవిడ్సన్, ట్రైయింప్‌  సహా, ఇతర  హై ఎండ్ బ్రాండ్ల మోటార్ సైకిళ్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ)   ఫిబ్రవరి 12 న  జారీ చేసిన  నోటిఫికేషన​ ప్రకారం   పూర్తిగా విదేశాల్లో  తయారైన బైక్‌లపై బేసిక్‌  దిగుమతి సుంకాన్ని 50 శాతానికి తగ్గించింది. ఇప‍్పటివరకూ 800 సీసీ అంతకంటే తక్కువ ఇంజీన్‌ కెపాసిటీ బైక్‌లపై 60శాతం  దిగుమతి సుంకం ఉండగా,  800సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం గల బైక్‌లపై దిగుమతి సుంకం 75శాతంగా ఉండేది.  పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ల దిగుమతులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకం రేటు  ఈ రెండు రకాల మోడళ్లపై 50 శాతానికి తగ్గించడంతో  దేశంలో వీటి ధరలు తగ్గుముఖం పడతాయని   ఈవై పార్టనర్‌  అభిషేక్ జైన్ చెప్పారు.

సీబీఎఫ్‌సీ నోటిఫికేషన్ ప్రకారం, ప్రీ ఎసంబుల్డ్‌ ఇంజిన్, గేర్‌బాక్స్‌ లేదా ట్రాన్స్మిషన్ మెకానిజంపై పూర్తిగా దిగుమతి చేసుకున్న (సీకేడీ) వస్తు సామగ్రిపై, దిగుమతి సుంకం  25 శాతానికి తగ్గించింది.  ఇంతకుముందు ఇది 30శాతంగా ఉంది.  మరోవైపు మేక్‌ ఇన్‌ ఇండియా లో భాగంగా స్థానిక తయరాదారులకు ప్రోత్సహించేందుకు ఎసంబుల్డ్‌ కాని ఇంజిన్, గేర్ బాక్స్,  ట్రాన్స్మిషన్ మెకానిజం దిగుమతిపై 15 శాతం వరకు కస్టమ్స్ సుంకం పెంచివంది.  ఇది ఇప్పటివరకు  10 శాతంగా ఉంది.  తద్వారా ఆటోమొబైల్ సహాయక పరిశ్రమలను రక్షించే ఒక పెద్ద సందేశాన్ని ప్రభుత్వం పంపిందనీ,  గొప్ప తయారీ కేంద్రంగా  ఇండియాకు  ప్రాధాన్యత నిచ్చేలా విధానాన్ని రూపొందించిందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అనూప్ కాల్వాత్  వ్యాఖ్యానించారు.  
 

మరిన్ని వార్తలు