పెట్రోల్‌, డీజిల్‌ ధరలు : వాటితో మనీ సేవ్‌

7 Sep, 2018 16:28 IST|Sakshi

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్కై రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరగడమే కానీ తగ్గడం కనిపించడం లేదు. నేడు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సుమారు 50 పైసలు మేర పైకి ఎగిశాయి. మొత్తంగా గత నెల నుంచి పెట్రోల్‌పై లీటరుకు మూడు రూపాయలు, డీజిల్‌పై లీటరుకు నాలుగు రూపాయలు ధర పెరిగింది. ఇలా వాతపెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో మీ జేబులు ఖాళీ అవుతుంటే, వెంటనే బ్యాంక్‌లు క్రెడిట్‌ కార్డులను వాడడంటూ ఆఫర్‌ చేస్తున్నాయి. మీ క్రెడిట్‌ కార్డుల వాడకం ద్వారా ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చని చెబుతున్నాయి. అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వం రంగ బ్యాంక్‌లు క్రెడిట్‌ కార్డులపై ఇంధన సర్‌ఛార్జ్‌ను మాఫీ చేస్తున్నాయి. అంతేకాక రివార్డు పాయింట్లను రిడీమ్‌ చేసుకుని, ఇంధనం కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నాయి.

కొటక్‌ మహింద్రా: 
కొటక్‌ రాయల్‌ సిగ్నేచర్‌ క్రెడిట్‌ కార్డు...
రూ.500 నుంచి రూ.3000 మధ్యలో లావాదేవీలకు కొటక్‌ రాయల్‌ సిగ్నేచర్‌ క్రెడిట్‌ కార్డుదారులకు ఫ్యూయల్‌ సర్‌ఛార్జ్‌ మాఫీ లభిస్తుంది. గరిష్ట మాఫీని ఏడాదిలో రూ.3500 పొందేలా పరిమితం చేసింది ఈ బ్యాంక్‌. 

సిటీ బ్యాంక్‌ : 
సిటీ బ్యాంక్‌ రివార్డ్స్ క్రెడిట్‌ కార్డు...
మీ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.125 విలువైన ప్రతి కొనుగోలుపై ఒక రివార్డు పాయింట్‌ను పొందవచ్చు. అప్పీరల్‌ లేదా డిపార్ట్‌మెంట్‌ స్టోర్లలో చేసే కొనుగోళ్లపై పది రెట్ల రివార్డు పాయింట్లను పొందవచ్చు. ఈ రివార్డు పాయింట్లను దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా ఇండియన్‌ ఆయిల్‌ అవుట్‌లెట్లలో ఇంధన బిల్లులు చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒక్క రివార్డు పాయింట్‌ విలువ 0.25 పైసలు.

ఇండియన్‌ ఆయిల్‌ సిటీ ప్లాటినం కార్డు...
దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక ఇండియన్‌ ఆయిల్‌ అవుట్‌లెట్లలో 150 రూపాయల విలువైన ఇంధన కొనుగోళ్లపై 4 టర్బో పాయింట్లను పొందవచ్చు. ఈ టర్బో పాయింట్లను ఉచిత ఇంధనం పొందడానికి ఉపయోగించుకోవచ్చు. ఒక్క టర్బో పాయింట్‌ ఉచిత ఇంధన విలువ రూపాయి. షాపింగ్‌, డైనింగ్‌ వంటి వాటిపై టర్బో పాయింట్లను పొందవచ్చు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ :
హెచ్‌డీఎఫ్‌సీ మనీబ్యాక్‌ క్రెడిట్‌ కార్డు...
ఇంధన కొనుగోళ్లుపై ప్రతి నెలా గరిష్టంగా 250 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా : 
బీపీసీఎల్‌ ఎస్‌బీఐ కార్డు...
మీరు జాయినింగ్‌ ఫీజు చెల్లించిన తర్వాత, రూ.500 విలువైన రివార్డు పాయింట్లు క్రెడిట్‌ అవుతాయి. వీటిని భారత్‌ పెట్రోలియయం అవుట్‌లెట్లలో ఇంధన బిల్లు చెల్లింపులకు వాడుకోవచ్చు. అంతేకాక బీపీ అవుట్‌లెట్‌ వద్ద ప్రతి ఫ్యూయల్‌ కొనుగోళ్లపై 4.25 శాతం వాల్యు బ్యాక్‌ ఆఫర్లను ఎస్‌బీఐ ఇస్తోంది. 4000 రూపాయల వరకు ఉన్న ప్రతి లావాదేవీపై, 1 శాతం సర్‌ఛార్జ్‌ మాఫీతో పాటు 3.25 శాతం వాల్యు బ్యాక్‌ ఆఫర్‌ను పొందవచ్చు.
 
సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ కార్డు అండ్‌ సింప్లీ సేవ్‌ క్రెడిట్‌ కార్డు....
రూ.500 నుంచి రూ.3000 మధ్యలో ఉన్న లావాదేవీలపై 1 శాతం సర్‌ఛార్జ్‌ మాఫీ వినియోగదారులకు లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులపై గరిష్టంగా నెలకు 100 రూపాయల వరకు మాఫీనీ పొందవచ్చు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా...
తన అన్ని క్రెడిట్‌ కార్డులపై జీరో ఫ్యూయల్‌ సర్‌ఛార్జ్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అందిస్తుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేను చేసిన పెద్ద తప్పు అదే: బిల్‌గేట్స్‌

టేబులే.. స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్‌!

ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!

పాత కారు.. యమా జోరు!!

ట్రేడ్‌ వార్‌ భయాలు : పసిడి పరుగు

గుడ్‌న్యూస్‌ : 20 రోజుల్లో 20 స్మార్ట్‌ఫోన్లు ఫ్రీ

నష్టాలకు చెక్‌: భారీ లాభాలు

తాగి నడిపితే..ఇకపై రూ.10 వేలు ఫైన్‌!

350 పాయింట్లు జంప్‌ చేసిన స్టాక్‌మార్కెట్లు

సమోసా, కచోరీలతో కోట్లకు కొలువుతీరి..

మెహుల్‌ చోక్సీకి షాక్‌

64 మెగాపిక్సెల్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌

బడ్జెట్‌లో తీపి కబురు ఉండేనా..?

ఆధార్‌ ప్రింట్‌ చేసినట్టు కాదు..!

వివాదాల ‘విరాళ్‌’... గుడ్‌బై!

సగం ధరకే ఫ్యాషన్‌ దుస్తులు

1.76 లక్షల ఉద్యోగులకు మరోసారి షాక్‌!

బిన్నీబన్సల్‌ అనూహ్య నిర్ణయం 

చివరికి నష్టాలే..,

నష్టాల బాట : ఆటో, మెటల్‌ టౌన్‌

అమెరికా వర్సెస్‌ ఇండియా? కాదు కాదు..

మొబైల్‌ యాప్స్‌ నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌తో ఎన్నో ప్రయోజనాలు

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఫార్మా ఫండ్‌

మిడ్‌క్యాప్‌లో లాభాల కోసం...

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ ప్రారంభం

‘కియా’ చౌకధర ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రాజీనామా

వరుణ దేవుడా... క్రికెట్‌ మ్యాచ్‌లకు అడ్డురాకు...!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్‌

మేఘాకు జాక్‌పాట్‌

ఆ కోరిక ఇంకా తీరనేలేదు!

గిల్టీ ఫీలింగ్‌తో...

జగపతిబాబు@ స్కార్‌ రవిశంకర్@ ముఫార్‌

మరో రీమేక్‌లో?