భారత్‌కు అనుకూలించిన అంతర్జాతీయ వాతావరణం

4 Jan, 2020 02:01 IST|Sakshi

2019లో అత్యధికంగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు

ఇదే పరిస్థితి 2020లోనూ కొనసాగొచ్చు: డీబీఎస్‌

సింగపూర్‌: భారత ఆర్థిక వ్యవస్థ 2019లో అంతర్జాతీయంగా ఉన్న సానుకూల వాతావరణంతో ప్రయోజనం పొందిందని, ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కొన్నేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని సింగపూర్‌కు చెందిన బ్యాంకింగ్‌ గ్రూపు డీబీఎస్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి నిలకడగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా అధిక లిక్విడిటీ (పెట్టుబడులు), చమురు ధరలు నిలకడగా ఉండడం వంటివి సానుకూలించినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2019–20లో ఇప్పటి వరకు బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు సగటున 65 డాలర్లుగా ఉందని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 70 డాలర్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.

>
మరిన్ని వార్తలు