రిలయన్స్ ఏజీఎం హైలైట్స్

21 Jul, 2017 13:39 IST|Sakshi



ముంబై: అందరూ ఊహించినట్టుగా రిలయన్స్‌  అధినేత సంచలన ప్రకటన చేశారు. జియో  ఫోన్‌ భారతీయులందరికీ  పూర్తిగా ఉచితమని రిలయన్స్ ఇండస్ట్రీస్   రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో ముకేశ్‌  ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఫీచర్‌ ఫోన్‌ లాంచ్‌ చేశామన్నారు.  ఇండియాస్‌ ఇంటిలిజెంట్‌ ఫోన్‌ అంటూ   అంబానీ  వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు.   ఉచిత వాయస్‌ కాల్స్‌, ఉచిత డేటా అంటూ  సునామీ సృష్టించిన  జియో ఇపుడిక  జియో ఫోన్‌ఉచితమంటూ ప్రత్యర్థులు బాంబులు పేల్చింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం) హైలైట్స్

ఆర్ఐఎల్ ఐపీఓకు వచ్చిన తర్వాత ఇది 40వ సంవత్సరం
1977లో రూ. 33 కోట్ల టర్నోవర్
2017లో రూ. 3.3 లక్షల కోట్ల టర్నోవర్
40 సంవత్సరాల్లో టర్నోవర్‌లో 4700 శాతం వృద్ధి రేటు
32 శాతం  వృద్ధి రేటు సాధించిన రిలయన్స్
గత 40 ఏళ్లలో 10వేల రెట్లు పెరిగిన నికర లాభం
50 వేల రెట్లు పెరిగిన మార్కెట్ క్యాప్
3,500 నుంచి 2.5 లక్షలకు పెరిగిన ఉద్యోగుల సంఖ్య
ప్రతీ రెండున్నరేళ్లకు రెట్టింపు అయిన మదుపర్ల సంపద
1977లో రూ. 1000 పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ. 16.5 లక్షలు
170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను అందుకున్న రిలయన్స్ జియో
గత 40 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించిన కంపెనీలలో ఒకటి
దేశంలో మరే ఇతర కార్పొరేట్ కంపెనీ ఈ స్థాయి వృద్ధి సాధించలేదు..


తండ్రిని తలుచుకుని భావోద్వేగం
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వృద్ధి కనబరిచిన కంపెనీలు కొన్నే
10 కోట్ల కస్టమర్లను జియో అధిగమించింది
ప్రస్తుతం రిలయన్స్ జియోకు 12.5 కోట్ల మంది కస్టమర్లు
సగటున ప్రతీ 7 సెకన్లకు ఒక కస్టమర్
ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ కంటే వేగంగా జియోకు ఆదరణ
వీడియోలకు నెలకు 125 కోట్ల జీబీ ఇంటర్నెట్ వినియోగం
 ప్రతీ రోజూ 250 కోట్ల నిమిషాల కాల్స్
మొబైల్ డేటా వినియోగంలో నెంబర్ వన్ స్థానంలో ఇండియా
ఫ్రీ నుంచి పెయిడ్ సబ్‌స్క్రైబర్లుగా మారడం అతి పెద్ద రికార్డ్
ఉచిత కస్టమర్లను పెయిడ్ కస్టమర్లుగా మార్చగలిగాం..
10 కోట్ల మంది కంటే అధికంగా పెయిడ్ కస్టమర్లు
జియో ప్రైమ్, ధన్ ధనా ధన్ ప్లాన్స్ కొనసాగుతాయి
ఇండియాలో 78 కోట్ల మొబైల్ ఫోన్స్
ఇందులో 50 కోట్ల ఫీచర్ ఫోన్స్ ఉన్నాయి
డిజిటల్ ఇండియా లక్ష్యంలో వీరు భాగం కాలేకపోతున్నారు
డిజిటల్‌ ఇండియా పథకాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు
అందరికీ డిజిటల్ సాధికారత లేకపోవడం బాధాకరం.. దీన్ని మేము సాధిస్తాం.
రాబోయే 12 నెలల్లో దేశంలోని 99 శాతం మందికి అందుబాటులో జియో సేవలు
ఇండియాలో 2జీ కవరేజ్ కంటే 4జీ కవరేజ్ ఎక్కువ
పోటీ కంపెనీలకు 2జీ కవరేజ్ నిర్మాణానికి 25 ఏళ్లు పట్టింది..
3 ఏళ్లలోనే అంతకు మించిన 4జీ నెట్‌వర్క్‌
50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగాదారులకు  డేటా సేవలను  మరింత దగ్గర చేయనున్నాం


మేడ్ బై ఇండియా.. మేడ్ ఫర్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా
సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 10వేల జియో ఆఫీస్‌లు
ఇంటెలిజెంట్   4 జీ ఫీచర్‌ ఫోన్ "జియో ఫోన్"  ఆవిష్కరణ
జియో కస్టమర్లకు 100శాతం 4జీ  వీఓఎల్టీఈ జియో ఫోన్‌ ఉచితం
రూ. 153 లకే  నెలకు అన్ని సేవలు ఉచితం
1500 వన్‌ టైం సెక్యూరిటి డిపాజిట్‌
3 సం.రాల తరువాత పూర్తిగా ఈ డిపాజిట్‌  రిఫండ్‌
భాషా అనేక్‌ భారత్‌ ఏక్‌ 22 భాషల్లో
ఆగస్టు 15నుంచి  ట్రయల్‌ రన్‌
ఆగస్టు 24 నుంచి ప్రీ బుక్‌ ఆఫర్‌
సెప్టెంబర్‌  నుంచి ఈ డివైస్‌లుఅందుబాటులో
ప్రతి ఈక్విటీ షేరుకు ఒక షేరు బోనస్‌- రిలయన్స్‌ ముకేశ్‌ అంబానీ
 


 

మరిన్ని వార్తలు