కరోనా వ్యాప్తి: టెకీలకు బోనస్‌ల కోత

20 Mar, 2020 12:02 IST|Sakshi

ముంబై: సాఫ్ట్‌వేర్‌ రంగంపై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. అసలే ఆర్థిక మాంధ్యం ముంచుకొస్తున్న తరుణంలో కరోనా ప్రభావంతో ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేస్తున్నట్లు కంపెనీలకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. కొన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేస్తుంటే మరికొన్ని కంపెనీలు సెలవులు ప్రకటించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బోనస్‌లు, ఇంక్రిమెంట్లు తాత్కాళికంగా నిలిపివేసినట్లు టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతపైనే దృష్టి సారించామని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం అసెంచర్‌ వృద్ది శాతాన్ని 6-8శాతం నుంచి 3-6శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. ప్రస్తుత సంక్షోభంలో కంపెనీల ఆదాయం భారీగా తగ్గుతాయని.. తమ హేతుబద్ద నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించాలని ఎవరెస్ట్‌ గ్రూప్‌ సీఈఓ పీటర్‌ బెండర్‌ తెలిపారు. ఐటీ కంపెనీలు కొనసాగుతున్న ప్రాజెక్టులపైనే దృష్టి సారించాయని కొత్త ప్రాజెక్టుల స్వీకరించడానికి సిద్దంగా లేవని నాస్‌కమ్‌కు చెందిన ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు