మెటల్ ఎక్స్ ప్రతిపాదనకు హిందాల్కో ఓకే

27 Apr, 2016 01:18 IST|Sakshi

5 శాతం పెరిగిన హిందాల్కో షేర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గనుల కంపెనీ మెటల్ ఎక్స్ టేకోవర్ ఆఫర్‌కు హిందాల్కో సమ్మతి తెలియజేయనున్నది. హిందాల్కో అనుబంధ కంపెనీ, ఆస్ట్రేలియాలో లిస్టైన ఆదిత్య బిర్లా మినరల్స్(ఏబీఎంఎల్)ను మెటల్ ఎక్స్ కంపెనీ టేకోవర్ చేయనున్నది. ఈ టేకోవర్ ఆఫర్‌లో భాగంగా 4.5 ఏబీఎంఎల్ షేర్లకు ఒక మెటల్స్ ఎక్స్ షేర్‌ను కేటాయిస్తారు. అంతేకాకుండా ఒక్కో ఏబీఎంఎల్ షేర్‌కు 0.08 డాలర్(ఆస్ట్రేలియా) నగదు చెల్లిస్తారు.  మెటల్స్ ఎక్స్ ఆఫర్‌ను అంగీకారం తెలపనున్నామని ప్రకటించడంతో హిందాల్కో షేర్ బీఎస్‌ఈలో 5 శాతం ఎగసి రూ.103 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 13.3 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో కోటికి పైగా షేర్లు ట్రేడయ్యాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు