‘హిందూజా’ చేతికి చారిత్రక లండన్ భవనం

3 Mar, 2016 00:30 IST|Sakshi
‘హిందూజా’ చేతికి చారిత్రక లండన్ భవనం

లండన్: సెంట్రల్ లండన్‌లోని చారిత్రాత్మక ఓల్డ్ వార్ ఆఫీస్ భవనం లాంఛనంగా హిందూజా గ్రూప్ వశమైంది. ఇప్పటికే భవనానికి సంబంధించిన తాళాలు హిందూజా గ్రూప్ చేతికి వచ్చేశాయి. హిందూజా గ్రూప్ ఈ పురాతన భవనాన్ని 5 స్టార్ హోటల్‌గా, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్‌గా అభివృద్ధి చేయనున్నది. అలాగే ఇందులో ప్రైవేట్ ఫంక్షన్ రూమ్స్, స్పా సెంటర్స్, ఫిట్‌నెస్ కేంద్రాలు వంటి తదితర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నది. బ్రిటిష్ పార్లమెంట్‌కు, బ్రిటన్ ప్రధాని నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ భవనం.. 5.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 3 కిలోమీటర్ల మేర పొడవున్న ఏడు అంతస్థుల కారిడార్లు కలిగి ఉంది. హిందూజా గ్రూప్.. స్పానిష్ ఇండస్ట్రియల్ కంపెనీ ఓహెచ్‌ఎల్‌డీతో కలిసి ఈభ వనాన్ని 250 ఏళ్లకు గానూ లీజ్ పద్ధతిలో బ్రిటన్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఈ భవనంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భవన నిర్మాణం 1906లో పూర్తయ్యింది. ఇందులో 1,100 రూమ్స్ ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు