ప్యుగోట్‌ చేతికి అంబాసిడర్‌ బ్రాండ్‌

12 Feb, 2017 01:59 IST|Sakshi

కోల్‌కతా: దేశీయంగా కార్ల విపణిలో ఓ వెలుగు వెలిగిన అంబాసిడర్‌ బ్రాండ్‌.. తాజాగా ఫ్రాన్స్ కి చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం ప్యుగోట్‌ చేతికి చేరింది. దాదాపు రూ. 80 కోట్లకు దీన్ని విక్రయించేందుకు సీకే బిర్లా గ్రూప్‌ సారథ్యంలోని హిందుస్తాన్‌ మోటార్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, తమకు చెల్లించాల్సిన బకాయిల వివాదం ఇంకా పరిష్కారం కాకుండానే.. యాజమాన్యం అంబాసిడర్‌ బ్రాండ్‌ విక్రయించడం సరికాదని కంపెనీ కార్మిక నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 

1957లో అంబాసిడర్‌ కార్ల తయారీ ప్రారంభం కాగా... కాలక్రమంలో ప్రాభవం కోల్పోయిన నేపథ్యంలో 2014 మేలో హిందుస్తాన్‌ మోటార్స్‌ వీటి తయారీ నిలిపివేసింది.    అంబాసిడర్‌ బ్రాండ్‌ను వినియోగించుకుని దేశీయంగా కార్ల ఉత్పత్తి పెంచుకోవాలని ప్యుగోట్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు కంపెనీలు స్పష్టత ఇవ్వలేదు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం త్వరలోనే ప్యుగోట్‌ దేశీయంగా ఏడాదికి లక్ష కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు