30 శాతం పెరిగిన హెచ్పీసీఎల్ నికర లాభం

23 Aug, 2016 01:28 IST|Sakshi
30 శాతం పెరిగిన హెచ్పీసీఎల్ నికర లాభం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొ(హెచ్‌పీసీఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో  ఏకంగా 30 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.1,614 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.2,098 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ఇంధన విక్రయాలు పెరగడం, ఇన్వెంటరీ లాభాలు అధికం కావడం, రిఫైనరీ మార్జిన్లు నిలకడగా ఉండడం  వల్ల ఈ స్థాయి లాభాలు సాధించామని కంపెనీ సీఎండీ ముకేశ్ కె. సురానా వివరించారు.

దేశీయంగా అమ్మకాలు 5 శాతం పెరిగి 8.89 మిలియన్ టన్నులకు చేరాయని పేర్కొన్నారు. గత క్యూ1లో రూ.600 కోట్లుగా ఉన్న ఇన్వెంటరీ లాభాలు ఈ క్యూ1లో రూ.1,100 కోట్లకు పెరిగాయని వివరించారు. అయితే ఇంధనం ధరలు తగ్గడంతో టర్నోవర్ రూ.54,822 కోట్ల నుంచి రూ.51,661 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు