రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న హైన్స్‌

9 Dec, 2019 00:54 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన రియల్టీ సంస్థ, హైన్స్‌ భారత్‌లో 50 కోట్ల డాలర్లు (రూ.3,500 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నది. భారత్‌లో కొత్త వాణిజ్య, నివాసిత ప్రాజెక్ట్‌ల్లో ఈ రేంజ్‌లో పెట్టుబడులు పెట్టాలని హైన్స్‌  యోచిస్తోంది. ప్రస్తుతం ప్రొపర్టీ మార్కెట్లో మందగమనం ఉన్నా, భవిష్యత్తులో వృద్ధికి మంచి అవకాశాలున్నాయని ఈ కంపెనీ భావిస్తోంది. ఆఫీస్‌స్పేస్‌ లీజింగ్‌కు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉందని కంపెనీ పేర్కొంది.  ప్రస్తుతం హైన్స్‌ కంపెనీ 23 దేశాల్లోని 219 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2006లో భారత్‌లో  ప్రవేశించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 40 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ చేపట్టిన ఆరు  ప్రాజెక్ట్‌ల్లో రెండు ప్రాజెక్ట్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి.

మరిన్ని వార్తలు