కోవిద్‌ సంక్షోభంలోనూ మల్టీబ్యాగర్‌గా నిలిచింది..!

2 Jun, 2020 15:25 IST|Sakshi

ఏడాదిలో 17శాతం లాభపడిన షేరు

కోవిడ్‌-19 సృష్టించిన సంక్షోభంతో స్టాక్‌ మార్కెట్‌లో మార్చి నెలలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రధాన షేర్లన్నీ కొన్నేళ్ల కనిష్టాన్ని దిగివచ్చాయి. అయితే ఒక్క షేరు మాత్రం ఈ సంక్షోభంలోనూ మల్టీబ్యాగర్‌గా నిలిచింది. అలాగే ఏకంగా షేరు ఏడాది గరిష్టాన్ని తాకింది. అదే బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేరు...

కేవలం కరోనా సమయంలోనే కాకుండా దశాబ్ధ కాలం నుంచి బ్రిటానియా ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇస్తుంది. గత పదేళ్లలో ఈ షేరు 2000 శాతం పెరిగింది. మూడేళ్లలో 90శాతం, గడచిన ఏడాదిలో 17శాతం పెరిగింది. మంగళవారం(జూన్‌ 02న) ట్రేడింగ్‌లో షేరు రూ.3451 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఈ షేరుకు 12 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘స్ట్రాంగ్‌ బై’’,  9 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను ఇచ్చాయి. మరో 9 బ్రోకింగ్‌ సంస్థలు ‘‘హోల్డ్‌ ’’ రేటింగ్‌ను కేటాయించాయి. మరోవైపు కేవలం 5 బ్రోకింగ్‌ సంస్థలు మాత్రమే ‘‘సెల్‌’’ రేటింగ్‌ను ఇచ్చాయి.

బిస్కెట్లు భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఉత్పత్తి విభాగంగా చెలామణి అవుతున్నాయి. బేకరీ పరిశ్రమ మొత్తం అమ్మకాల్లో బిస్కెట్లు, కుకీల వాటా 72 శాతం వాటా ఉన్నట్లు ఇండియన్‌రిటైల్‌ డామ్‌ తన నివేదికలో తెలిపింది.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో బిస్కెట్లు, నూడల్స్‌ లాంటి వస్తువులకు భారీగా డిమాండ్‌ నెలకొంది. హోటల్స్‌ మూసివేత, స్ట్రీట్‌ఫుడ్‌పై నిషేధం తదితర కారణాలతో ఇంటి ఆహారం తర్వాత ప్యాక్‌ చేసిన బిస్కెట్లు ప్రజల ఆహారంలో భాగంగా మారాయి. 


వచ్చే మూడేళ్లలో బ్రిటానియా అత్యుత్తమ పనితీరు కనబరిచే అవకాశం ఉందని ఫిలిప్‌ క్యాపిటల్‌ బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఈపీఎస్‌ వార్షిక ప్రాతిపదిక 14శాతం చొప్పును వృద్దిని సాధింస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో షేరుకు గతంలో కేటాయించిన ‘‘న్యూట్రల్‌’’ రేటింగ్‌ను ‘‘బై’’ రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. అలాగే షేరుకు టార్గెట్‌ ధర రూ.3,550గా నిర్ణయించింది. అంతేకాకుండా, కార్పొరేట్ పాలన ఆందోళనలను నిర్మూలించడానికి డైరెక్టర్ల బోర్డు తీసుకునే ఏ నిర్ణయం అయినా షేరు వ్యాల్యూయేషన్‌ మల్లీపుల్స్‌ రీ-రేటింగ్‌కు దారీతీయవచ్చని బ్రోకరేజ్‌ తన నివేదికలో తెలిపింది.

మరిన్ని వార్తలు