జెట్‌ ఎయిర్‌వేస్‌కు చమురు సెగ

12 Nov, 2018 18:22 IST|Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌కు చమురు ధరల సెగ

వరుసగా మూడవ త్రైమాసికంలోనూ నష్టాలు

సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా మండుతున్న చమురు ధరలు విమానయాన సంస్థల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభంలో చిక్కి విలవిల్లాడుతున్న ప్రయివేటురంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ను  బాగా ప్రభావితం చేసింది. వరుసగా మూడవ క్వార్టర్‌లో కూడా భారీ నష్టాలను మూట గట్టుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ  త్రైమాసిక ఫలితాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ భారీ నష్టాలను నమోదు చేసింది.  రూ.1298 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం 496.3 మిలియన్ల లాభాలను సాధించింది. ఆదాయం 6161 కోట్లకు పరిమితమైంది. 

ఏకంగా ఇంధన వ్యయం 58.6 శాతం పెరిగి రూ. 24.20 బిలియన్లకు చేరుకుంది.  ఆపరేటింగ్‌ ఆదాయం 9.5 శాతం పెరిగింది. మరోవైపు విక్రమం మెహతా ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా రాజీనామా చేశారు.  కాగా నరేష్ గోయల్ నేతృత్వంలోని జెట్‌ ఎయిర్‌వేస్‌​ నిధుల కొరత సమస్యను అధిగమించే వ్యూహంలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు