ఆసుపత్రి.. నడిచొస్తుంది!

4 Nov, 2016 00:59 IST|Sakshi
ఆసుపత్రి.. నడిచొస్తుంది!

ఐసీయూతో సహా ఫిజియో, కీమోథెరపీ సేవలన్నీ ఇంట్లోనే
దంత, కంటి శస్త్ర చికిత్సలు కూడా
వైద్య నిపుణుల కోసం ఆసుపత్రులకు తిరగక్కర్లేదు కూడా
ఆసుపత్రి గది, బెడ్ చార్జీలుండవ్; దీంతో 20-30 శాతం డబ్బు ఆదా
రూ.16,750 కోట్లకు చేరిన దేశీ హోమ్ హెల్త్‌కేర్ పరిశ్రమ
నాలుగైదేళ్లలో రెండింతలు దాటేస్తుందంటున్న నిపుణులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దిగ్గజ ఆసుపత్రుల గ్రూప్ ఆపోలో... వైద్యుడి కన్సల్టింగ్, నర్సింగ్, పరీక్షల శాంపిల్స్ సేకరణ సహా పలు వైద్యసేవల్ని రోగుల ఇంట్లోనే అందించేందుకు ‘అపోలో హోమ్‌కేర్’ను ఆరంభించింది. ఇక ఖాతాల కుంభకోణంతో తెరమరుగైన సత్యం గ్రూపు... కాల్‌హెల్త్ పేరిట సమగ్ర హోమ్‌హెల్త్‌కేర్ సేవలతో రంగంలోకి దిగింది. ట్యూటర్‌విస్టా, బిగ్‌బాస్కెట్, బ్లూస్టోన్ కంపెనీల సహ వ్యవస్థాపకురాలు మీనా గణేశ్... హోమ్‌హెల్త్‌కేర్ సంస్థ పోర్టియాను ఆరంభించి తక్కువకాలంలోనే అన్ని నగరాలకూ విస్తరించారు. డాబర్ ప్రమోటర్లరుున బర్మన్ కుటుంబీకుల దన్నుతో హెల్త్‌కేర్ ఎట్ హోమ్ మొదలైంది.

ఇక నైటింగేల్స్, మ్యాక్స్, మెడ్‌వెల్ వెంచర్స్, వాస్తల్య, కేర్ 24, లైఫ్ సర్కిల్, జోక్టర్, జోజ్, ఫ్రిస్కా వంటి స్టార్టప్‌లు సైతం ఆరంభమైన కొద్దినెలలకే ఇతర నగరాలకు విస్తరిస్తూ దూకుడు మీదున్నారుు. మెట్రోలకే పరిమితం కాకుండా కొన్ని ద్వితీయశ్రేణి నగరాలకూ వెళుతున్నారుు. కారణం...! హోమ్‌హెల్త్‌కేర్‌కు పెరుగుతున్న డిమాండే. ఏకంగా 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ పరిశ్రమ... వచ్చే మూడు నాలుగేళ్లలో రెండింతలు దాటేస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నారుు. అందుకే దిగ్గజాలు వాటా కోసం పావులు కదుపుతున్నారుు. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం..

అవసరం నుంచే ఆరంభం..
నగరాల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం సాధారణం. మరి అలాంటి కుటుంబాల్లో పిల్లలకో, పెద్దలకో ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితేంటి? వైద్యుల అపారుుంట్‌మెంట్లు తీసుకుని, సెలవులు పెట్టి ఆసుపత్రులకు తిరగటం అయ్యే పనేనా? ఇలాంటపుడే హోమ్‌హెల్త్‌కేర్ అవసరం కనిపిస్తోంది. నిజానికి దేశంలో వైద్యులు, వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి 10వేల మంది జనాభాకు ఏడుగురు వైద్యులే ఉన్నారు. ఆసుపత్రి బెడ్లూ అరకొరే. ‘‘హోమ్ హెల్త్‌కేర్ ఎదగటానికి కారణాలివే’’ అనేది మెడ్‌వెల్ వెంచర్స్ చైర్మన్ విశాల్ బాలి మాట. హోమ్ హెల్త్‌కేర్ మార్కెట్ 2017కి 10 బిలియన్ డాలర్లకు చేరుతుందని గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక చెబుతోంది.

 ఇంటివద్దే సేవలు...
రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జరుున రోగికి వైద్య పర్యవేక్షణ అవసరం. బీపీ, షుగర్ చూడటం, సమయానికి ఇంజక్షన్లు, మందులు ఇవ్వటం, అవసరమైతే ఫిజియోథెరపీ... ఇవన్నీ ఇంటివద్దే చేయొచ్చు. కానీ చేసేవారు లేక ఆసుపత్రులకు వెళ్లేవారే అధికం. ఈ హోమ్‌హెల్త్‌కేర్ సంస్థలొచ్చాక ఇళ్లకు నర్సుల్ని, వైద్యుల్ని పంపి మరీ ఇవి ఆ సేవల్ని అందిస్తున్నారుు. కొన్ని హోమ్‌హెల్త్ సంస్థలైతే ఇళ్ల దగ్గరే ఆపరేషన్లూ చేస్తున్నారుు. కావలసిన పరికరాలు, ఫర్నిచర్‌ను వెంట తీసుకెళుతున్నారుు కూడా. ఇక కొన్ని సంస్థలైతే సేవల్లోనూ ప్రత్యేకత కనబరుస్తున్నారుు. వాస్తల్య సంస్థ డెంటల్ కేర్‌కు పరిమితం కాగా...

ఢిల్లీలోని షార్ప్ ఐ సెంటర్ ఇటీవలే హోమ్ ఐ కేర్ సేవల్ని ఆరంభించింది. విజయవాడ, గుంటూరుల్లో పనిచేస్తున్న ఫ్రిస్కాకేర్... వైద్య నిపుణులనూ ఇళ్లకు పంపిస్తోంది. ఇక ‘హోమ్ కేర్ ఎట్ హోమ్’ సంస్థ... రూ.10-15 వేల ఛార్జీతో ఇంట్లోనే కావలసినవారికి ఐసీయూ ఏర్పాటు చేస్తోంది. ఇక ఇంట్లోని రోగిని ఆసుపత్రిలోని వైద్యులతో అనుసంధానం చేసేలా హోమ్‌హెల్త్‌కేర్ సంస్థలు ప్రత్యేక యాప్‌లు రూపొందించారుు. రోగి నిద్రలో ఉన్నపుడు తీసే స్లీప్ అనాలసిస్‌కు ఆసుపత్రికెళ్లాలి. కానీ ఇపుడు ఈ యంత్రాన్ని రోగి ఇంటికే తీసుకెళ్లి సేకరిస్తున్నారు.

 20-30 శాతం డబ్బు ఆదా..!
ఆసుపత్రి ఖర్చులతో పోలిస్తే హోమ్‌హెల్త్ కేర్‌తో సుమారు 20-30 శాతం దాకా సొమ్ము ఆదా అవుతుందన్నది ఫ్రిస్కాకేర్ వ్యవస్థాపకుడు ఆసిఫ్ మొహమ్మద్ మాట. ‘‘ప్రయాణ చార్జీల నుంచి ఆసుపత్రి గది, బెడ్ ఛార్జీలు, డాక్టర్ అపారుుంట్‌మెంట్ ఫీజు. ఇతరత్రా ఖర్చులూ మిగిలుతారుు. అదేకాదు. ఆసుపత్రంటే పేషెంట్‌లో ఉండే భయం తొలిగి, రోగి త్వరగా కోలుకుంటాడు’’ అని ఆసిఫ్ చెప్పారు. హోమ్‌హెల్త్ కేర్ సేవలతో ఆపరేషన్ తరవాత పేషెంట్ ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం పోరుుందని నైటింగేల్స్ సీఈఓ లలిత్ పాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘చికిత్స తరవాత అబ్జర్వేషన్ కోసం పేషెంట్‌ను ఆసుపత్రిలో ఉంచుకోకుండా డిశ్చార్జి చేసేసి, పర్యవేక్షణను ఇంటి దగ్గరే చేస్తే పేషెంట్ కుటుంబానికి డబ్బు ఆదా అవటమే కాదు.

ఆసుపత్రి ఆ బెడ్‌ను మరొకరికి కేటారుుంచవచ్చు. అది ఇరువురికీ లాభం’’ అని పాయ్ చెప్పారు. అరుుతే హోమ్ హెల్త్‌కేర్ వృద్ధికి ప్రతిబంధకమైన అంశమూ ఒకటుంది. అది... ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల మాదిరి మన దేశంలో హోమ్ హెల్త్‌కేర్‌కు బీమా సౌకర్యం లేదు. పేషెంట్ గనక ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నా, లేక ఆసుపత్రిలో గదులు లేకపోరుునా సదరు చికిత్సకు బీమా కవరేజీ ఇస్తామని లిబర్టీ వీడియోకాన్ జనరల్ ఇన్సూరెన్‌‌స చెబుతోంది.

 హైదరాబాద్ స్టార్టప్స్ హవా..
దేశంలో గతేడాది హోమ్ హెల్త్‌కేర్ స్టార్టప్స్ 57 డీల్స్ ద్వారా 277 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించారుు. ఐఎఫ్‌సీ, క్వాల్‌కామ్ వెంచర్స్, వెంచర్ ఈస్ట్ వంటి సంస్థల నుంచి పోర్షియా 37.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించగా... హైదరాబాదీ సంస్థ రూ.200 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. పలువురు పీఈ ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నామని.. డిసెంబర్‌లోగా డీల్‌ను క్లోజ్ చేస్తామని సంస్థ సీఈఓ హరి తాళ్లపల్లి చెప్పారు. ఇటీవలే వాస్తల్య.. ఎస్ స్క్వార్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి రూ.11 కోట్ల నిధుల్ని సమీకరించింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కేర్ 24... సైఫ్ పార్టనర్స్, ఇండియా కోషంట్ నుంచి 4 మి. డాలర్లు సమీకరించింది.

ఏ ఏ దేశాల్లో ఎంతెంతంటే..
ప్రపంచవ్యాప్తంగా హోమ్ హెల్త్ కేర్ పరిశ్రమ 227.5 బిలియన్ డాలర్లు. 2020 నాటికి ఇది 349.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనేది గ్రాండ్ వ్యూ రీసెర్చ్ అంచనా.

ప్రస్తుతం ఏఏ దేశాల్లో ఎంతనేది చూస్తే...

 

మరిన్ని వార్తలు