మార్కెట్‌లోకి మరో కంపెనీ : బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు

28 Aug, 2018 12:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ మేకర్స్‌ షావోమి, ఒప్పో, వివో, లెనోవో లాంటివి ఇప్పటికే భారత మొబైల్‌ మార్కెట్‌ను శాసిస్తుండగా, మరో చైనా మొబైల్‌  తయారీదారు భారతీయ కస్టమర్లపై దృష్టిపెట్టింది. తాజాగా చైనాకంపెనీ హామ్‌టామ్‌ దేశీయస్టార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది   మిడ్‌ సెగ్మెంట్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌  చేసింది.  ఇందులో మూడు సంవత్సరాల వారంటీతోపాటు,  రెండు సార్లు  స్ర్కీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌కూడా అందిస్తోంది. హెచ్‌1,  హెచ్‌ 3, హెచ్‌ 5 డివైస్‌లను విడుదల చేసింది.  మొదటి ఆరు నెలల్లో స్మార్ట్‌ఫోన్‌ విఫణిలో మూడు నుండి ఐదు శాతం వాటాను  సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  హోమ్‌టామ్ ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్ డైరెక్టర్ నిఖిల్ భూటాని  చెప్పారు.

హెచ్‌1 స్మార్ట్‌ఫోన్‌: 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే , 18.9 యాస్పెక్ట్‌ రేషియో 640x1280  రిజల్యూషన్‌ 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌​, 13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీని  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధరః  రూ .7,499,

హెచ్‌3 స్మార్ట్‌ఫోన్‌: 5.5అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే , 18.9 యాస్పెక్ట్‌ రేషియో,  720x1440 రిజల్యూషన్‌ 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్, ఎంటీకే 1.3 గిగాహెడ్జ్‌ బిట్64 , 13+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీని  ప్రధాన ఫీచర్లు, ధర రూ .9,990

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో  ఫేస్ అన్‌లాక్‌  ఫీచర్‌ను అమర్చింది.

హెచ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌: 5.7 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే , 720x1440 రిజల్యూషన్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ 16 + 2 రియర్‌ కెమెరా,   8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3300  ఎంఏహెచ్‌ బ్యాటరీ విత్‌ ఫాస్ట్ ఛార్జింగ్,  ధర: రూ .10,990.

ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేస్తాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

2019లో ప్రపంచవృద్ధి 3 శాతమే! 

వేగంగా విస్తరిస్తున్న ఎంఫైన్‌ 

లాభాలకు బ్రేక్‌.. 

21 రోజుల్లోపు స్పందించండి

అమూల్‌ నుంచి ఒంటె పాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డేట్‌ ఫైనల్‌

నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు

ఇస్మార్ట్‌ గాళ్‌ ఇన్‌?

కనుక్కోండి చూద్దాం

ఆస్కారం  ఎవరికి?

టీజర్‌  ఫ్రెష్‌గా  ఉంది – డి. సురేశ్‌బాబు