రెండో అతిపెద్ద బైక్స్‌ తయారీ కంపెనీగా హోండా

4 May, 2017 01:57 IST|Sakshi
రెండో అతిపెద్ద బైక్స్‌ తయారీ కంపెనీగా హోండా

బజాజ్‌ వెనక్కి; టాప్‌లో హీరో
ముంబై: హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ఏప్రిల్‌ నెలలో బజాజ్‌ ఆటోను వెనక్కునెట్టి రెండో అతిపెద్ద బైక్స్‌ తయారీ కంపెనీగా అవతరించింది. అలాగే టూవీలర్‌ మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతున్న హీరో మోటొకార్ప్‌కు  కూడా సవాల్‌ విసురుతోంది. ‘తొలిసారిగా రెండో అతిపెద్ద మోటార్‌సైకిల్‌ కంపెనీగా అవతరించాం. చాలా ఆనందంగా ఉంది. కంపెనీ బైక్స్‌ అమ్మకాలు 22% వృద్ధితో 1,83,266 యూనిట్లకు ఎగశాయి’ అని హెచ్‌ఎంఎస్‌ఐ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) వై.యస్‌.గులెరియా తెలిపారు.

కాగా బజాజ్‌ దేశీ విక్రయాలు ఏప్రిల్‌ నెలలో 19% క్షీణతతో 1,61,930 యూనిట్లకు తగ్గాయి. దీంతో హోండా కంపెనీకి బజాజ్‌ ఆటోకి మధ్య బైక్స్‌ విక్రయాల అంతరం 21,336 యూనిట్లుగా నమోదయ్యింది. ఇదేసమయంలో మొత్తం విక్రయాల పరంగా చూస్తే హీరోకి , హోండాకి మధ్య అంతరం 12,377 యూనిట్లుగా ఉంది. ఏప్రిల్‌లో హోండా మొత్తం వాహన విక్రయాలు 34% వృద్ధితో 5,78,929 యూనిట్లకు ఎగిస్తే.. హీరో మొత్తం వాహన అమ్మకాలు మాత్రం 3.5% క్షీణతతో 5,91,306 యూనిట్లకు తగ్గాయి.

మరిన్ని వార్తలు