హోండా కొత్త బైక్... సీబీ హార్నెట్ 160

10 Dec, 2015 23:51 IST|Sakshi
హోండా కొత్త బైక్... సీబీ హార్నెట్ 160

ధర రూ.79,900
 పనాజి:
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ కంపెనీ కొత్త బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సీబీ హార్నెట్ 160 ఆర్ పేరుతో అందిస్తున్న ఈ కొత్త బైక్ ధర రూ.79,900 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)అని  కంపెనీ తెలిపింది. భారత్ స్టేజ్(బీఎస్)-ఫోర్ పర్యావరణ నిబంధనలకనుగుణంగా తయారైన తొలి భారతీయ బైక్ ఇదని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కీత మురమత్సు చెప్పారు.  ఈ బైక్ విక్రయాలు 21 నగరాల్లో నేటి(శుక్రవారం) నుంచి, దేశవ్యాప్తంగా కొత్త ఏడాది నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 160 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ బైక్ సింగిల్ డిస్క్, డ్యుయల్ డిస్క్ విత్ సీబీఎస్... ఈ రెండు వేరియంట్లలో లభిస్తుందని చెప్పారు. ఈ మోడల్‌కే ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా