హోండా విస్తరణ వ్యూహాలు : బైక్‌లపై భారీ తగ్గింపు

10 Apr, 2018 20:27 IST|Sakshi

ప్రత్యర్థి కంపెనీ హీరోపై మరింత  ఒత్తిడి

భారీ విస్తరణ ప్రణాళికలతో హెచ్ఎంఎస్ఐ

వచ్చే ఏడాదిలో రూ.800కోట్ల పెట్టుబడులు

బైక్‌లపై భారీగా ధర తగ్గింపు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల ఉత్పత్తుల సంస్థ  హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మరో టూ వీలర్‌ దిగ్గజానికి షాకిచ్చేలా దూసుకుపోతోంది.  వచ్చే ఏడాది నాటికి డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ సాధన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించింది.  2019 ఆర్థిక సంవత్సరంలో రూ .800 కోట్ల  పెట్టుబడులతోపాటు వరుసగా మూడేళ్ల పాటు రెండంకెల వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని  హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు, సీఈఓ మనోరు కటో మంగళవారం తెలిపారు. త్వరలోనే ఒక కొత్త ప్రొడక్ట్‌ను ప్రారంభిస్తామన్నారు. దీంతో తమ ఉనికిని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెంచుతామన్నారు. అలాగే  ఈ ఏడాదిలో 18 ఇతర ఉత్పత్తులను అప్‌గ్రేడ్‌ చేస్తామని ఆయన ప్రకటించారు. 2018-19 నాటికి, గత ఆర్థిక సంవత్సరంలో 5,700 అవుట్లెట్ల నుంచి 6వేల టచ్‌ పాయింట్స్‌ను పెంచుతామని తద్వారా  విక్రయాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని యోచిస్తోంది. అయితే 2020 నాటికి టూవీలర్‌ ఇండస్ట్రీ  బీఎస్‌-6 ఎమిషన్ నిబంధనలకు అప్‌గ్రేడ్‌తో ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

బైక్‌లపై భారీగా ధర తగ్గింపు
మరోవైపు  ఫ్లాగ్‌షిప్‌ సూపర్‌బైక్‌ మోడళ్లపై ధరలను భారీగా తగ్గించింది. సీబీఆర్‌1000ఆర్‌ఆర్‌ ఫైర్‌బ్లేడ్‌ మోడల్స్‌పై రూ. 2.5లక్షల వరకు ధరను తగ్గించినట్లు హోండా తెలిపింది. దిగుమతి చేసుకునే పూర్తిగా నిర్మితమైన యూనిట్ల(కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్స్‌)పై సుంకాన్ని 25శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో  ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసేందుకే బైక్‌లపై ధరలను తగ్గించినట్టు చెప్పింది.

సవరించిన ధరల ప్రకారం.. హోండా సీబీఆర్‌1000ఆర్‌ఆర్‌ మోడల్‌ ధర రూ. 16.79లక్షల(ఎక్స్‌షోరూం దిల్లీ) నుంచి రూ. 14.78లక్షలకు (ఎక్స్‌షోరూం దిల్లీ) పడిపోయింది. ఇక సీబీఆర్‌1000ఆర్‌ఆర్‌ ఎస్‌పీ మోడల్‌ ధర రూ. 21.22లక్షల(ఎక్స్‌షోరూం దిల్లీ) నుంచి రూ. 18.68లక్షలకు(ఎక్స్‌షోరూం దిల్లీ) తగ్గింది. ఈ న్యూ జెనరేషన్‌ ఫైర్‌బ్లేడ్‌ మోడళ్లను హోండా గతేడాది భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బీఎండబ్ల్యూ, డుకాటి, సుజుకీ, హర్లీ డేవిడ్‌సన్‌, యమహా కూడా తాము దిగుమతి చేసుకుంటున్న సీబీయూ ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి 2018 ఆర్థిక సంవత్సరంలో, హోండా అమ్మకాలు 22శాతం పెరుగుదల నమోదు చేసింది. 6.12 మిలియన్ యూనిట్లను విక్రయించింది.   అంతేకాదు  7.59 మిలియన్ యూనిట్ల విక్రయాలతో 2016-17 లో ప్రధాన ప్రత్యర్థి  హీరో మోటోను అధిగమించింది. దేశంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీదారుగా ఉన్న సంస్థ  దేశంలో 50శాతం స్కూటర్లను విక్రయిస్తోంది. హర్యానాలోని మనేసర్లో, రాజస్థాన్లోని తపుకారాలో, కర్ణాటకలోని నరస్పురా, గుజరాత్లోని విఠలాపూర్లలో ప్రస్తుతం నాలుగు కర్మాగారాలలో 6.4 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది.

మరిన్ని వార్తలు