-

పదిలక్షల కార్లను రీకాల్ చేసిన హోండా

17 Jun, 2016 17:00 IST|Sakshi
పదిలక్షల కార్లను రీకాల్ చేసిన హోండా

బీజింగ్:  ప్రముఖ కార్ల కంపెనీలను ఎయిర్ బ్యాగ్ లోపాలు  పట్టిపీడిస్తున్నాయి.  ఎయిర్ బ్యాగ్ లోపాల కారణంగా దిగ్గజ కంపెనీలు  లక్షల సంఖ్యలో కార్లను అనేకమార్లు వెనక్కితీసుకున్నాయి. తాజాగా హోండా మోటార్స్ 10 లక్షల ఎస్యూవీ, సెడాన్ కార్లను రీకాల్ చేయనుంది. చైనా భాగస్వామ్యంతో తయారుచేసి  చైనాలో  విక్రయించినకార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు కంపెనీ క్వాలిటీ ఎజెన్సీ శుక్రవారం ప్రకటించింది .

2007 -11 మధ్య కాలంలో  డాంగ్ ఫెంగ్ హోండా ఆటోమొబైల్స్ ఉత్పత్తి చేసి న హోండా సీఆర్ -వీ  యుటిలిటీ వెహికల్స్, సివిక్ అండ్  ప్లాటినం రూయీ సెడాన్ , సివిక్ హైబ్రిడ్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.  


కాగా టకాటా ఎయిర్ బ్యాగ్ లోపాల కారణంగా ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కార్లను అనేక కంపెనీలు రీకాల్ చేశారు. మరోవైపు ఈ లోపాల కారణంగా జరిగిన ప్రమాదాల కారణంగా 11 మంది మరణించగా 100మంది గాయపడ్డారు. . టకాటా ఎయిర్ బ్యాగ్ లో  వైఫల్యం కారణంగా ఇప్పటికే లక్షల కార్లను హోండా వెనక్కి తీసుకుంది. గతంలో జపాన్ లో కంపెనీ7 లక్షల 84 వేల కార్లను ఉపసంహరించుకుంది. ఒకేసారి  బలంగా ఈ ఎయిర్ బ్యాగ్ లు తెరచుకోవడంతో ప్రయాణీకులను గాయాల పాలవుతున్నారని  పేర్కొంది.
 

మరిన్ని వార్తలు