హానర్‌ 10 లైట్‌ లాంచ్‌

16 Jan, 2019 10:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా కంపెనీలలో షావోమి తరువాత హువావే బ్రాండ్‌కింద హానర్‌  స్మార్ట్‌ఫోన్లు భారతీయ కస్టమర్లను పలకరిస్తున్నాయి. అద్భుత ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా హానర్‌ 10 లైట్‌ అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో కంపెనీ విడదల చేసింది హానర్‌.   హానర్‌ 8 లైట్‌, 9 లైట్‌ డివైస్‌ల  వరుసలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. డ్యూ డ్రాప్‌ డిస్‌ప్లే, ఏఐ  ఆధారిత 24ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. రెండు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది. ధరలు 13,999 రూపాయల నుంచి ప్రారంభం.  ప్రత్యేకంగా  ఫ్లిప్‌కార్ట్‌ జనవరి 20నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి లభ్యం. అలాగే జియో నుంచి 2200 క్యాష్‌బ్యాక్‌తో పాటు రూ.2800 క్లియర్‌ట్రిప్‌ వోచర్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. 

హానర్‌ 10 లైట్‌ ఫీచర్లు
6.21 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ పై9
ఆక్టాకోర్‌ కిరిన్‌710 ప్రాసెసర్‌
4జీబీ/6జీబీ ర్యామ్‌
64జీబీస్టోరేజ్‌/ 
13+2 ఎంపీ రియర్‌ కెమెరా 
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మరిన్ని వార్తలు