హానర్‌ ‘30ఎస్‌’ ఆవిష్కరణ

31 Mar, 2020 18:20 IST|Sakshi

బీజింగ్‌: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్‌ సంస్థ తన 30 సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 30ఎస్‌ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యధునిక ఫీచర్లు పొందుపరిచారు. కిరిన్‌ 820 ప్రాసెసర్‌ 5జీ చిప్‌సెట్‌ కలిగిన మొదటి హానర్‌ ఫోన్‌ ఇదే. 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ఐపీఎస్‌ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్పీ కెమెరా ఒకటే ఉంది. 8జీబీ, 128 జీబీ, 8జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్‌ను చైనాలో ప్రీఆర్డర్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 7న నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. నలుపు, ఆకుపచ్చ, తెలుగు రంగుల్లో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్‌ హువాయ్‌ మొబైల్‌ సర్వీసెస్‌(హెచ్‌ఎంఎస్‌)పై ఆధారపడుతుంది. ఇందులో గూగుల్‌ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ప్లేస్టోర్‌ యాప్‌ ఉండదు.

30 ఎస్‌ ఫీచర్లు
6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డి, ఫుల్‌వ్యూ డిస్‌ప్లే
కిరిన్ 820 చిప్‌సెట్‌
ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌
64+8+8+8 ఎంపీ కెమెరాలు
16 ఎంపీ సెల్ఫీకెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర రూ. 25,500
8జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ ధర రూ. 29,000
 

మరిన్ని వార్తలు