హానర్‌ 7ఎక్స్‌ రెడ్‌ వేరియంట్‌

2 Feb, 2018 16:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  హువాయి బ్రాండ్‌  బడ్జెట్‌ ఫోన్‌కు చెందిన కొత్త వెర్షన్‌ను శుక్రవారం లాంచ్‌ చేసింది. హానర్‌  7ఎక్స్‌ రెడ్‌ వేరియంట్‌ను  లిమిటెడ్‌ ఎడిషన్‌గా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధరను 12,999 రూపాయలుగా ప్రకటించింది. ఎప్పటినుంచి లభ్యం అనేది స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ అమెజాన్‌లో ప్రత్యేకంగా  అందుబాటులో ఉండనుంది. హానర్‌ 6ఎక్స్‌ డివైస్‌కి సక్సెసర్‌గా  ఈ  స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది డిసెంబర్‌లో తీసుకొచ్చింది.  మెరుగుపర్చిన డిజైన్‌,  డ్యుయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో దీన్ని లాంచ్‌ చేసింది. 32జీబీ వేరియంట్‌ ధర రూ.12,999గాను 64జీబీ వేరియంట్‌ ధరను రూ.15,999 గానూ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

హానర్‌  7ఎక్స్‌ రెడ్‌ ఫీచర్లు
5.93ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
2160 x 1080  పిక్సెల్‌  రిజల్యూషన్‌,
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0  
4జీబీ ర్యామ్‌ 32 జీబీ/64జీబీ స్టోరేజ్‌
16ఎంపీ+2 ఎంపీ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3400  ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

మరిన్ని వార్తలు