హానర్‌ 9ఎన్ : లాంచ్‌ ఆఫర్లు, స్పెషిఫికేషన్లు

24 Jul, 2018 13:20 IST|Sakshi
హానర్‌ 9ఎన్‌ స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ : హానర్‌ బ్రాండులో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. హువావే సబ్‌బ్రాండ్‌ హానర్‌, తన లేటెస్ట్‌ హ్యాండ్‌సెట్‌ హానర్‌ 9ఎన్‌ ను న్యూఢిల్లీ వేదికగా లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ కీ ఫీచర్లు ‘నాచ్‌ ఫుల్‌వ్యూ’ డిస్‌ప్లే,  19:9 యాక్సెప్ట్‌ రేషియోతో బెజెల్‌-లెస్‌ డిస్‌ప్లేను, 12 లేయర్‌ ప్రీమియం గ్లాస్‌ డిజైన్‌ను ఇది కలిగి ఉంది. గత నెలలో చైనాలో లాంచ్‌ అయిన హానర్‌ 9ఐ(2018) మోడల్‌కు భారత్‌ వేరియంట్‌ ఈ హానర్‌ 9ఎన్‌ స్మార్ట్‌ఫోన్‌. హానర్‌ 9ఐ 2017 అక్టోబర్‌లో భారత మార్కెట్‌లోకి వచ్చింది. దీనికి సక్సెసర్‌గా.. మేడిన్‌ ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా దీన్ని కంపెనీ ప్రకటించింది.
 

హానర్‌ 9ఎన్‌ ధర, లాంచ్‌ ఆఫర్లు
హానర్‌ 9ఎన్‌(2018) 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.11,999 కాగ, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 13,999 రూపాయలు. ఇక 4జీబీ ర్యామ్‌/128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 17,999 రూపాయలుగా కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌, హాయ్‌హానర్‌స్టోర్‌ల ద్వారా జూలై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి వస్తుంది. లావెండర్‌ పర్‌పుల్‌, రాబిన్‌ ఎగ్‌ బ్లూ, మిడ్‌నైట్‌ బ్లాక్‌, సఫైర్‌ బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రిలయన్స్‌ జియో రూ.2200 క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది. 100 జీబీ అదనపు డేటా, 1200 మింత్రా ఓచర్లు కూడా పొందనున్నారు.  

హానర్‌ 9ఎన్‌ స్పెషిఫికేషన్లు...
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
5.84 అంగుళాల ఫుల్‌-హెచ్డీ ప్లస్‌ ఫుల్‌వ్యూ ఐపీఎస్‌ డిస్‌ప్లే
2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌
2.36 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌
13 మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌, 2 మెగాపిక్సెల్‌ సెకండరీ సెన్సార్లతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
 256 జీబీ వరకు విస్తరణ మెమరీ
రియర్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా